రాయచోటి: రాయచోటి మండలం చెన్నముక్కపల్లి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న మహిళా వీఆర్వోపై వేధింపులకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నముక్కపల్లికి చేందిన చవాకుల రాజేష్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని బాధిత మహిళా వీఆర్వో ఆరోపించింది.
ఈ సందర్బంగా బాధిత మహిళా వీఆర్వో మాట్లాడుతూ… సచివాలయానికి రాలేదంటూ తాను చెప్పినట్లు వినాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి ఫోటోలు తీసి, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. రాత్రిళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు.
కలెక్టర్ ఆఫీస్ లో రాత్రి 12 గంటలైనా పనిచేస్తారని, నువ్వెందుకు పనిచేయవంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేకాకుండా ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడంటూ, రాజేష్ వేధింపుల నుండి తనను రక్షించాలని బాధిత మహిళా వీఆర్వో కన్నీటి పర్యంతమైంది.