-మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు హరిరామజోగయ్య ఘాటు లేఖ
-మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్ నాశనం చేయొద్దు
-పవన్ కళ్యాణ్ పై బురద చల్లటానికి ప్రయత్నం చేయొద్దని సూచన
-‘పైకి రావాల్సిన వాడివి.. నీ భవిష్యత్ కోరి చెబుతున్నా’నంటూ హితవు
అమరావతి : మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య ఘాటు లేఖ రాశారు. అమర్ నాథ్ రాజకీయాల్లో బచ్చా అంటూ విరుచుకుపడ్డారు. ‘‘డియర్ అమర్ నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి. పైకి రావాల్సిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్ నాశనం చేయకు. అనవసరంగా పవన్ కళ్యాణ్ పై బురద చల్లటానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరిచెబుతున్నా’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల జనసేనపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు కాదని, పరోక్షంగా టీడీపీ కార్యకర్త అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్ల కంటే నోటాకు వచ్చే ఓట్లు ఎక్కువగా ఉండటం ఖాయమని సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో మంత్రికి హరిరామ జోగయ్య రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.