Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ డీజీపీగా హరీశ్‌కుమార్‌ గుప్తా

-ముగ్గురి పేర్లు సిఫారసు చేసిన ఏపీ ప్రభుత్వం
-హరీశ్ కుమార్ గుప్తాను ఎంపిక చేసిన ఎన్నికల సంఘం
-హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి

రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది. కాగా, కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన నేపథ్యంలో, ముగ్గురు సీనియర్ ఐజీల జాబితా పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో, ఏపీ ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు, హరీశ్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ ల పేర్లను సిఫారసు చేసింది.

అయితే, ఎన్నికల సంఘం ఈ జాబితా నుంచి హరీశ్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా ఎంపిక చేసింది. హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. తాజా నియామకం నేపథ్యంలో, తక్షణమే డీజీపీగా విధుల్లో చేరాలని హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ ఆదేశించింది.దానితో ఆయన డీజీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

LEAVE A RESPONSE