Suryaa.co.in

Telangana

బండి సంజయ్ యాత్రలో అడుగడుగునా నిలదీతలే

-ధరలు తగ్గించి మాట్లాడాలని అక్క చెల్లెళ్ల డిమాండ్లు
-కేంద్రంలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగుల ప్రశ్నలు
-కాంగ్రెస్ చేసిన దుర్బర పాలనను తెలంగాణ ప్రజలు మర్చిపోరు
-బిజెపి, కాంగ్రెస్ పై మంత్రి హరీశ్ రావు ఫైర్

సంగారెడ్డి పట్టణంలో అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన దళిత బంధు కార్యక్రమంలో పాల్గొని యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, టిఎస్ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి హరీశ్ రావు ఏమన్నారంటే ..
రాష్ట్రంలో ప్రతిపక్షాలు మంచి పని చేస్తే అపశకునం పలుకుతున్నాయు. 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసుకున్నారు కానీ ఏనాడూ రూపాయి దళితులకు ఇవ్వలేదు. ఇక బీజేపికి దళితులు అంటేనే గిట్టదు. ముఖ్యమంత్రి పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా దళిత బంధు అందిస్తున్నారు. వచ్చిన పని నచ్చిన పని చేసుకోమని సీఎం గారు అవకాశం కల్పించారు. అప్పుడు హుజూరాబాద్ లో ఇచ్చినం…ఎన్నికలు కాబట్టి అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న సంగారెడ్డిలో ఇస్తున్నాం.

బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దమ్ముంటే దళిత బంధు అమలు చేయాలి.కానే కాదు అన్న వాళ్ల ముఖం మీద గుద్దినట్టు కాళేశ్వరం మూడు ఏళ్లలో పూర్తి చేశాం. రేపో మాపో సంగారెడ్డికి గోదారి నీళ్ళు తెస్తాం.అన్ని జరిగితే టీఆరెఎస్ కు మంచి పేరు వస్తదని కాంగ్రెస్ , బిజెపి కి భయం పట్టుకున్నది.కేంద్రం దళితులకు పెట్టిన బడ్జెట్ ఎంత ? దేశం మొత్తం పెట్టిన దాని కంటే మేము దళిత బంధు కోసం 17,800 కోట్లు పెట్టాము.

మేము జనం కోసం తిరిగితే…. అపశకునం గాళ్ళకు మీరే బుద్ది చెప్పాలి. బండి సంజయ్ నీ తొండి మాటలు బంజెయ్.. గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు ఎప్పుడు తగ్గిస్తావ్ అని యాత్ర లో అక్క చెల్లెళ్ళు నిలదీస్తున్నారు. మా ఉద్యోగాలు ఏవి అని నిరుద్యోగులు అడుగుతున్నారు. బండి సంజయ్ ని అడుగడుగునా ప్రశ్నిస్తున్నారు.

చేసేవి తొండి పనులు, జనాన్ని మోసం చేస్తారు. దళిత బంధు ఇవ్వండి, కేంద్రంలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్న.కాంగ్రెస్ మోసం ఎవ్వరూ మర్చిపోరు. తాగు నీళ్ళు కూడా ఇవ్వలేదు నాడు.గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో పవర్ హాలిడేలు ఉన్నాయి. దేశంలో పవర్ హాలిడే లేని ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ.

LEAVE A RESPONSE