Suryaa.co.in

Telangana

మూసిపై పూటకో మాట చెబుతున్న సిఎం రేవంత్ రెడ్డి

– ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి గారూ..మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో లక్షా 50వేల కోట్లతో ప్రణాళికలు సిద్దం చేసినట్లు జులై 20వ తేదీన ప్రకటించారు.

సెప్టెంబర్ 6న మీ చేతుల మీదుగా విడుదల చేసిన ‘తెలంగాణ గ్రోత్ స్టోరీ ద రోడ్ టు వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ’ విజన్ డాక్యుమెంట్ లోనూ.. లక్షా 50వేల కోట్లు అంటే సుమారు 18 బిలియన్ల డాలర్లతో 5ఏళ్లలో మూసీ రివర్ ఫ్రంట్ రీడెవలప్మెంట్ కొరకు ఖర్చు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ లక్షా 50వేల కోట్లు ఎవరన్నారంటూ ఆవేశంతో ఊగిపోయారు. పూటకో తీరుగా మాట్లాడుతున్న మిమ్మల్ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది.

బిడ్డ పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు డీపీఆర్ లేకుండా లక్షా 50వేల కోట్లు ఖర్చవుతాయని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వాలకే చెల్లుతుంది.మూసీ రిజువినేషన్ అండ్ రివర్ ఫ్రంట్ పేరుతో ప్రజాధనం లూఠీ చేయాలనే మీ కుట్రలను బట్టబయలు చేస్తం. మీ నిరంకుశ విధానాలను అడుగడుగునా ఎండగడతాం. తెలంగాణ ప్రజల తరుపున నిలదీస్తం.

LEAVE A RESPONSE