హైదరాబాద్: శాసన సభలో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష ఉప నేతలుగా తన్నీరు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పటోళ్ల సబితా ఇంద్రారెడ్డిను బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు.
మండలిలో రమణ, పోచంపల్లి, విప్ గా దేశపతి శ్రీనివాస్
శాసన మండలిలో, బిఆర్ఎస్ పార్టీ శాసన మండలి పక్ష ఉప నేతలుగా ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ విప్ గా దేశపతి శ్రీనివాస్ ని పార్టీ అధినేత నియమించారు.