– 20-25మంది ఎమ్మెల్యేలకు హరీశ్ ఫండింగ్
– అవి కాళేశ్వరం నుంచి వచ్చిన డబ్బులే
– కవిత ఆరోపణ
హైదరాబాద్: కాళేశ్వరం నుంచి వచ్చిన అవినీతి డబ్బులతో హరీశ్ కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. ‘2018లో 20-25మంది ఎమ్మెల్యేలకు హరీశ్ ఫండింగ్ చేశారు. అవి కాళేశ్వరం నుంచి వచ్చిన డబ్బులే. కొద్దిగా అటు ఇటు అయితే ఆయన దగ్గర ఎమ్మెల్యేలు ఉండాలనే ఆ కుట్ర చేశారు. ఆయనకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? 2009లో కేటీఆర్ ను ఓడించేందుకు హరీశ్ రావు సిరిసిల్లకు రూ.60 లక్షలు పంపారు. కేసీఆర్ ,కేటీఆర్, నన్ను ఓడించేందుకు ఆయన కుట్ర చేశారు’ అని ఆరోపించారు.