Home » ‘మెరుగైన సమాజం’లో ధైర్యం మరుగైందా?

‘మెరుగైన సమాజం’లో ధైర్యం మరుగైందా?

– టీవీ9 రజనీకాంత్‌పై ఓ మహిళ ప్రశ్నల వర్షం
– రజనీకాంత్ ఆస్తులపై బహిరంగ చర్చ పెట్టిన వైనం
– ఆధారాలతో ప్రశ్నలు సంధించిన స్వాతిరెడ్డి
-బంధువు పేరుతో స్థలాలు, విల్లాలు కొన్నారంటూ ఆధారాలు బయటపెట్టిన స్వాతిరెడ్డి
– నివ్వెరపోయి నోరెళ్లబెట్టిన ‘మెరుగైన సమాజం’
– ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పని రజనీకాంత్
– తాను సచ్చీలుడినని చాటే చాన్సు వినియోగించుకోని వైచిత్రి
– తనపై పోస్టు పెట్టినందుకు ఆమెపై కేసు పెట్టిన ధైర్యశాలి
– ఇదేనా మీ ధైర్యమంటూ నెటిజన్ల ఎద్దేవా
– ఇతరులపై నిందలు వేసే మీపై ఎవరూ నిందలు వేయకూడదా?
– ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని చెప్పిన టీవీ9
– అలాగైతే మీమీద ఎన్ని వేల కేసులు పెట్టాలని ప్రశ్నల వర్షం
– ఆమె ఆరోపణలు అబద్ధాలని ఎందుకు ఖండించడం లేదు?
– అంటే మీ మౌనం అంగీకారమేనా?
– సోషల్‌మీడియాలో టీవీ9 రజనీకాంత్‌పై విమర్శల తుపాన్
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన మెరుగైన సమజాన్ని నిర్మించే మహత్తర లక్ష్యంతో పెట్టిన టీవీ9 అనే సంచలన చానెల్‌కు.. పెద్దహోదాలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్టు. టీవీ9 అంటేనే సంచలనం. ధైర్యానికి చిరునామా. బెడ్‌రూముల్లో కూడా తలపెట్టి శూలశోధన చేసే తెంపరితనం దాని సొంతం. అవినీతి-అక్రమాలపై కొరడా ఝళిపించే గుండెధైర్యం. భూములు-రియల్‌ఎస్టేట్ దందాల లొసుగులు.. ఆకాశమంత ఎత్తు నిర్మించే అపార్టుమెంటు నిర్మాణాల తెరవెనుక బాగోతాలు.. రాజకీయనేతల చీకటి జీవితాలు..ఏ పార్టీ గెలుస్తుందో చెప్పగల ఊహాశక్తి దానిసొంతం. ఇటీవలి ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోతుందని చెప్పిన టీవీ9 ఊహాశక్తి నిజమయిందిలెండి.

‘అవినీతి-బ్లాక్‌మెయిల్‌కు వందకిలోమీటర్ల దూరంలో ఉండటం’ దాని సిబ్బంది సిద్ధాంతం. నిఖార్సయిన నిజాలను మాత్రమే ప్రపంచానికి చాటే ఈ చానెల్.. చాలామంది ఆణిముత్యాలను తయారుచేసింది. అందులో రజనీకాంత్ ఒకరన్నది ఆ చానెల్ ఉద్యోగులు చెప్పేమాట. సాధారణ జర్నలిస్టు నుంచి అంతపెద్ద చానెల్‌కు బాసు స్థాయికి ఎదిగిన ఆయన ప్రతిభ అద్భుతం. అందుకు ఆయన పడ్డం కష్టం అనన్యసామాన్యం. ఆయన చర్చల తీరు కూడా అలాగే ఉంటుంది.

చాలా ముచ్చటగా.. ఒకింత పద్ధతిగా, నిష్పాక్షికంగా, ఎవరికీ ‘ఆరో వేలు’గా కాకుండా, ‘ఎవరినీ భుజాన్నేసుకోకుండా’.. ‘ ఆరోజు ఎవరిమీద బురదచల్లాలనే ముందస్తు కసరత్తు’లాంటివేవీ లేకుండా, జరిగే ఆయన డిబేట్లు చూడముచ్చటగా ఉంటాయి. ఇదేదో వ్యంగ్యమనుకుంటే పొరపాటు. ఆయన చర్చల మాదిరిగానే ఇది నిఖార్సయిన నిజం.

అలాంటి నీతి నిజాయితీపరుడైన రజనీకాంత్‌పై స్వాతిరెడ్డి అనే ఒక మహిళ, మొన్నీమధ్య చాంతాడంత పోస్టును సోషల్‌మీడియాలో వదిలింది. అందులో రజనీకాంత్ అక్రమ సంపాదన, ఆయన ముచ్చటపడి కట్టుకున్న విల్లాలు, పూటగడవని అత్యంత నిరుపేదలుండే ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో


11 కోట్లతో ఖరీదుచేసిన ఫ్లాట్, మోకిలాలో 8 కోట్లతో కొన్న విల్లా, మియాపూర్‌లో కొన్న త్రిబుల్‌బెడ్‌రూమ్. చార్టెడ్ ఫైట్ ప్రయాణం. ఇంకా చాలా..చాలా ప్రశ్నలు వేసింది ఆ మహిళ. వాటికి జవాబు చెప్పాలని నిలదీసింది. అంతా బాగానే ఉన్నప్పటికీ.. అందులో ఆమె వాడిన భాష తప్ప, మిగిలిన అంశాలన్నీ టీవీ9 తరహాలో చర్చనీయాంశమే.

పాపం. రజనీకాంత్ సాధారణ జర్నలిస్టు. సగటు మధ్య తరగతి వ్యక్తి. టీవీ9 లో పెద్ద స్థాయిలో పనిచేస్తున్నందున జీతం ఓ నాలుగైదు లక్షలు ఉంటుందేమో?! ఏదో డిబేటు చేసి పొట్టపోసుకునే సగటు జర్నలిస్టుకు సజ్జల భార్గవ్‌రెడ్డి, ధర్మారెడ్డితో ఏం పరిచయాలుంటాయి చెప్పండి? మంత్రిగారితో కలసి పబ్బుల్లో పెట్టుబడి పెట్టేంత తాహతు ఎక్కడుంటుంది మరీ చోద్యం కాకపోతే?!

ఆఫీసు పని ముగిసిన తర్వాత.. తన మానాన తాను రోజూ పక్కనే ఉన్న బస్‌స్టాప్‌లో టీఎస్‌ఆర్‌టీసీ బస్సులో వచ్చి, బస్సులో వెళ్లే సగటు జర్నలిస్టు అయిన రజనీకాంత్ దగ్గర, అన్నేసి కోట్ల రూపాయలు ఎక్కడుంటాయి పాపం.. మరీ అన్యాయం-ర్యాగింగ్ కాకపోతే!?

సరే.. టీవీ9 మాదిరిగా స్వాతిరెడ్డి అదే మహిళ, ఏదో రజనీకాంత్‌పై ఉత్తి నిందలు వేసిందనుకుందాం. టీవీ9 మాదిరిగానే అవి గాలికబుర్లు-గాలి కథనాలే అనుకుదాం. దానిమాదిరిగానే బెదిరింపు-బ్లాక్‌మెయిల్ కోసమేననుకుందాం. నీతి-నిజాయతీ-నిఖార్సయిన జర్నలిస్టు బిడ్డ రజనీకాంత్‌ను.. వారిమాదిరిగానే పనికట్టుకుని, బద్నామ్ చేయాలన్న దుర్బుద్ధితోనే ఆ పోస్టు చేశారనుకుందాం. జస్ట్ కాసేపు ‘అనుకుందాం’.

మరి గుండెధైర్యం ఎక్కువగా ఉన్న టీవీ9 ప్రతినిధి రజనీకాంత్ ఏం చేయాలి? ఆమె ఆరోపణలన్నీ గాలికబుర్లని, తాను సత్యహరిశ్చంద్రుడి అంశలో పుట్టిన నిఖార్సయిన జర్నలిస్టునని, తన చేతులు శుభ్రంగా ఉంటాయని, అసలు


తనకు ఎలాంటి భవనాలు-విల్లాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవని, ఆ ధర్మారెడ్డి ఎవరో తనకు తెలియదని, తన జీవితంలో అసలు చార్టెడ్ ఫ్లైట్ ముఖమే చూడలేదని, ఒకవేళ చూసినా సరదాగా బేగంపేట ఎయిర్‌పోర్టు చూసేందుకు వెళ్లినప్పుడు, అక్కడున్న చార్టెడ్ ఫ్లైట్‌ను చూశానని చెప్పి, ఆమె నోరు మూయించే అవకాశం ఉన్న రజనీకాంత్.. దానిని ఎందుకు వినియోగించుకోలేదన్నది ఆయన అభిమానుల ఆవేదన.

ఆమె ఒక్క నోరు మాత్రమే కాదు. ఆమె పెట్టిన పోస్టును చెదివిన లక్షలాది-కోట్లాదిమంది దృష్టిలో అప్రతిష్ఠపాలైన తన ప్రతిష్ఠను.. తెరముందుకొచ్చి నోరువిప్పి నిలబెట్టుకోవచ్చుకదా అన్నది రజనీకాంత్ అభిమానుల అంతరంగంలో జ్వలిస్తున్న ప్రశ్నలు. దానితోపాటు ఇన్‌కంటాక్సు నోటీసులంటూ సోషల్‌మీడియా దుర్మార్గులు చేస్తున్న ప్రచారానికీ శంషేర్‌గా జవాబు చెప్పి, వారి నోళ్లు మూయించకుండా మౌనంగా ఉండటమే ఆయన అభిమానులకు రుచించడం లేదట.

ఇందులో తప్పేమీలేదు. టీవీ9 తన కథనాల్లో ఫలానా వారిపై ఆరోపణలు సంధించినప్పుడు, వారి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే లీగల్‌గా దొరకరు కాబట్టి. ఆ సందర్భంలో సదరు టీవీ9 బాధితుడు ప్రెస్‌మీట్ పెట్టి తన కథనాన్ని ఖండించినప్పుడు, స్టుడియోలో ఉండే యాంకరమ్మలో-యాంకరయ్యలో స్పందిస్తారు. తమ వద్ద ఉన్న ఆధారాలను ఒకటికి పదిసార్లు గింగిరాలు తిప్పి మరీ ప్లే చేస్తుంటారు. ఒక్కోసారి అత్యుత్సాహంతో సవాళ్లు కూడా విసురుతుంటారు. ఇప్పుడు స్వాతిరెడ్డి అనే మహిళ తనపై చేసిన ఆరోపణలకు, తనతోపాటు తాను పనిచేసే టీవీ9 సంస్థపై కూడా మరకలు పడి అప్రతిష్ఠపాలయి నిందలు పడి ంది. మరి అవన్నీ అబద్ధమని, ఒకవేళ అవి నిజమైతే వాటిని మీకే రాసిస్తానని గంభీరంగా చెప్పే అవకాశం ఉన్న రజనీకాంత్.. మౌనవ్రతం పాటించడమే విచిత్రం.

తన నిజాయితీ నిరూపించుకోవడం బదులు, తనపై పోస్టు పెట్టిన స్వాతిరెడ్డి అనే మహిళపై కేసు పెట్టడమే వింత. ఎన్నోవేల కుంభకోణాలు బయటపెట్టి, బడానేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీవీ9 చానెల్ సంస్థ.. ఇలా తనపై వచ్చిన ఒక్క పోస్టుకే గత్తర వచ్చి, ఒక మహిళపై కేసు పెట్టడమే ఆశ్చర్యం. తమకు అన్యాయం జరిగినప్పుడు కోర్టును ఆశ్రయించటం మన హక్కు. కాదనలేం.

కానీ అసలు ఆమె చేసిన ఆరోపణపై కనీసం తన చానెల్‌లో, తానే డిబేట్ పెట్టి తన పాతివ్రత్యం నిరూపించుకోకుండా, ఒక మహిళపై కేసు పెట్టడంపై సోషల్‌మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.

అందరి జీవితాలతో ఆడుకునే మీకు ఆ బాధ ఇప్పుడు తెలిసిందా?.. ఇతరుల అవినీతిగురించి మాట్లాడే మీరు, మీ అవినీతిని బయటపెడితే కేసులు పెడతారా?.. ఒక మహిళపై కేసుపెట్టిన మీపై మీ బాధితులు ఎన్ని వేల కేసులు పెట్టాలి?.. మీ పాతివ్రత్యం నిరూపించుకోవడం చేతకాక ఒక మహిళపై కేసులు పెడతారా? ఇదేనా మీ ధైర్యం?.. అసలు మొన్న ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది.. టీడీపీ ఓడిపోతుందని కూసిన మీ గురించి చెప్పిన ఆ మహిళకు జోహార్లు.. గెలిచిన వారానికే టీడీపీ-జనసేన ఎంతకాలం కలసి ఉంటాయి అన్న మీ వంకర ప్రశ్నలే మీ నిజాయితీని చెబుతున్నాయి.. అంటూ నెటిజన్లు శివాలెత్తుతున్నారు.

ఇంతకూ స్వాతి రెడ్డి అనే మహిళ, రజనీకాంత్‌పై సంధించిన ఆరోపణాస్త్రామేమిటన్నది చూద్దాం. ఆమె పోస్టులోని అభ్యంతరకర వ్యాఖ్యలు మినహా యధాతథంగా..

టీవీ9 రజనీకాంత్ ఉచ్చ పోసుకునే అసలు నిజాలు

నేను అమాయకుడిని.. నేను తోపుని.. నేను పుడింగిని.. నేను మట్టిగడ్డని.. నేను పేడ ముద్దని అంటూ, ఒక చిల్లర అబద్ధపు ఆర్టికల్ ని జనాల్లోకి వదిలాడు రజనీకాంత్.. ఇతని ముఖం చూస్తేనే జనాలు కాండ్రించి ఉమ్మేసి ఎక్కడ కనపడితే అక్కడ పట్టుకు కడతారనే భయంతో తన ఛానెల్ ఉద్యోగుల్ని బెదిరించి, ఆ ఆర్టికల్ ని బలవంతంగా జనాల్లోకి పంపుతున్నాడు.. పనిలో పని తనకి ఎన్నికల్లో కట్ డ్రాయర్ మాదిరిగా పని చేసిన నరసింహారావు అనే ఉప్మా పోరంబోకు జర్నలిస్ట్ సాయంతో, వాడి దిక్కుమాలిన ఎవడూ చదవని వెబ్ సైట్ లో వార్త రాయించి ఆర్టికల్ వదిలాడు.

చిల్లర జర్నలిస్ట్ వదిలిన ఆర్టికల్ పై కొన్ని ప్రశ్నలు..

– నీకు ఆస్తులు లేవనేది నిజమైతే ఒక్కసారి నీ పేరున నీ కూతురు, భార్య , నీ అక్క , బావ, నీ మేనల్లుడు పేరన ఉన్న ఆస్తుల పై శ్వేత పత్రం విడుదల చేయి.
– నువ్వు విజయసాయిరెడ్డి కోడలు కనికారెడ్డికి చెందిన స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయలేదని నీ కూతురితో ఒక్క వీడియో చేయించు.
– నీకు ఇన్ కం ట్యాక్స్ నోటీసులు రాలేదని నీ భార్యతో ఒక్క ప్రకటన విడుదల చేయించు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో SAS CROWN లో నీకు ఫ్లాట్ లేదని పబ్లిక్ గా చెప్పు.
– మోకీలా లో సుభిషి విల్లాల్లో నీకు విల్లా లేదని మైక్ పట్టుకుని అరచి చెప్పు.
– మియాపూర్ ప్రణీత్ కన్ స్ట్రక్షన్స్ లో నీకు త్రిబుల్ బెడ్ రూమ్ లేదన్న విషయం చెప్పు.
– అమరావతి కృష్ణాయ పాలెంలో నీకూతురు, మేనల్లుడు పేరు మీద 18 ఎకరాలు లేదని అఫిడవిట్ మీద రాసి ఇవ్వు.
– నీ బినామి ధర్మారెడ్డి పేరు మీద నీకు శంషాబాద్ లో KLR వెంచర్ లో అరెకరం స్థలంలో ఇల్లు కట్టడం లేదన్న విషయం చెప్పు.
– విజయవాడ గుంటూరు రోడ్డులో కాజ టోల్ గేట్ వద్ద RK VENUZIA లో ఆ సంస్థ యజమానిపై తప్పుడు కథనాలు వేసి.. బ్లాక్ మెయిల్ చేసి టవర్ 1 లో 18వ ఫ్లోర్ నీ బావ పేరు మీద రాయించుకున్నది నిజం కాదా? హీరో మహేష్ బాబుకు ఆ సంస్థ ఇచ్చిన ఫ్లోర్ కింద నీకు కావాలబీ బలవంతంగా తీసుకున్నది నిజం కాదా? (ఇపుడు ఆ సంస్థ దివాళా తీసింది)
– మంత్రి పెద్ది రెడ్డి సాయంతో గుంటూరు జిల్లా ఎడ్లపాడులో గ్రానైట్ క్వారీ కొట్టేసి నీ బావ పేరు మీద క్రషర్ నడుపుతున్నది నిజం కాదా?
– బెంగుళూరు అవుట్ కట్స్ లో నీ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రీమియర్ ఇన్ఫ్రా కి నీకు ఎలాంటి సంబంధం లేదని మొత్తం కిషోర్ రెడ్డి దేనని రాసి ఇవ్వు.
– జూబ్లీ హిల్స్ పబ్, వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్డులో కొత్త పబ్బు నీకు సంబంధం లేదని పబ్లిక్ గా చెప్పగలవా? ఏపీ మినిస్టర్ తో కలిసి నువ్వు పబ్ స్టార్ట్ చేసింది నిజం కాదా?
– విశాఖలో కోడిగుడ్డు మంత్రి నీకు భోగాపురం పక్కనే ఉన్న ప్రకృతి అవెన్యూస్ లో మూడు ప్లాట్లు గిఫ్ట్ గా ఇచ్చింది నిజం కాదా?
– అమెరికాలోని డల్లాస్ లో గోంగూర రెస్టారెంట్ నీది కాదా?
ఇవన్నీ ఇప్పటివరకూ దొరికిన ఆధారాలు మాత్రమే.. ఇంకా నీ పాపాల చిట్టా వస్తూనే ఉంది.. డీమ్లోనే అత్యంత ధనిక జర్నలిస్టువి నువ్వు కాదా? నీ గుంటూరు తెలివితేటలతో నీ ఆస్తులు ఎక్కడా బయటపడకూడదని, తెలివిగా ఇప్పటికే యూసఫ్ గూడ ఇంట్లోనే ఉంటావు.

అవును .. ఇప్పుడు నువ్వు ఉంటున్న ఫ్లాట్ కూడా , నీ గురువు రవిప్రకాశ్ దానం చేసింది కదా.. నీకు అన్ని డబ్బులుంటే సొంతంగా ఛానెల్ పెట్టేవాడిని కదా అని రాస్తున్నావు. వాస్తవానికి ఇప్పుడు నీ ప్లాన్ కూడా అదే కదా? రేపు టీవీ9 నుంచి పీకేశాక కొత్త ఛానెల్ సొంతంగా స్టార్ట్ చేయడానికి లైసెన్స్ కోసం తిరుగుతున్నావు కదా? గతంలో మూసేసిన తులసి, ఏపీ24 , స్టూడియో ఎన్ ఛానెళ్ల లైసెన్సుల కోసం ఆల్రెడీ ఇప్పటికే పదిమందితో మాట్లాడావు కదా?!

ఇక నువ్వు సచ్చీలుడివా ? నువ్వు శిఖరానివా? నువ్వు నిజాయితీ పరుడివా?

కనీసం చిన్న వార్త రాయడం కూడా రాని వాడివి. ఉద్యోగం కావాలని హైదరాబాద్ రబ్బరు చెప్పులతో వస్తే, నీకు అన్నంపెట్టి ఛానెల్లో ఉద్యోగం ఇచ్చి.. నీకు స్క్రీన్ మీద ఎలివేషన్ ఇచ్చి, నువ్వు ఉండటానికి ఇల్లు ఇచ్చి, తిరగడానికి కారు ఇచ్చి, నీవు ఊహించనంత జీతం ఇచ్చిన గురువు రవిప్రకాశ్ మీద కుట్ర చేసి బయటకు పంపి, ఆయన్ని జైల్లో పెట్టించినోడివి నువ్వు సచ్చీలుడివా?

ఎంతసేపు తోటి ఉద్యోగుల ఐడియాల్ని కొట్టేసి, అంతా నేనే అని చెప్పుకు బతికే నువ్వు శిఖరానివా? ఒక్కసారి ఛానెల్ వచ్చి చూడు యూట్యూబ్ చానెల్లో పని చేయడానికి కూడా పనికిరావు. ఇదీ స్వాతిరెడ్డి అనే మహిళ.. టీవీ9ను వెలిగిస్తున్న రజనీకాంత్ అనే ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్టుపై సోషల్‌మీడియాలో పెట్టిన పోస్టింగ్. ఇందులో నిజమెంతో రామేశ్వరుడికెరుక?!

Leave a Reply