(బి.బాబు)
పాపాత్ములు మూల్యం చెల్లించే ఘడియలు ఆసన్నమయ్యాయి.హైకోర్టులో చుక్కెదురు, లొంగిపోతాను అని అన్నా.. సుప్రీంకోర్టు ససేమిరా అంది.
అరెస్టుకు రంగం సిద్దం అయ్యింది. గౌరవంగా లొంగుతాడో.. దేశం వదిలి పరారవుతాడో!
పిల్ల పెద్దిరెడ్డికి తన చేసిన మద్యం స్కాం గురించి తెలుసు. నాన్న పెద్దిరెడ్డికి చెయ్యి విరిగిందని మెడికల్ సర్టిఫికేట్ కోర్టుకు చూపించి బెయిలు పొందాడు. మరోసారి పార్లమెంటు సమావేశాలకు హాజరవ్వాలని బెయిలు పొందాడు.
సిట్ పిలిస్తే హాజరవ్వకుండా.. తప్పించుకు తిరుగుతూ.. బెయిల్ల మీద బెయిల్ల పిటీషన్లు వేశాడు.ఆ బ్రేకుల్లేని బెయిల్ ప్రయాణంలో.. ముందుగా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు.. “అయ్యా, మీకు ముందస్తు బెయిల్ అవసరం లేదు, మీరు చాలా స్ట్రాంగ్, వెళ్లి ఎదుర్కొనండి!” అన్నట్లుగా పిటిషన్ను తిరస్కరించేశారు. పాపం, మిథున్ రెడ్డి గారు ఎంత ఆశ పెట్టుకున్నారో! సరే, హైకోర్టు కాకపోతే ఏముంది? మన దేశంలో ఇంకో కోర్టు ఉంది కదా, అని ఢిల్లీ పయనమయ్యారు.
అక్కడ.. గౌరవనీయులైన సుప్రీంకోర్టు పెద్దలు, జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం ఎదుట మిథున్ రెడ్డి గారి పిటిషన్! మనోడు ఏదో కాస్త గడువు అడిగారట,
“అయ్యా, జస్ట్ ఓ వారం రోజులు టైమ్ ఇవ్వండి, లొంగిపోతాను” అని. కానీ సుప్రీం పెద్దలు ‘నో సార్, గడువు గీడువు కుదరదు’ అన్నట్లుగా.. పిటిషన్ను
ఏకంగా డిస్మిస్ చేసేశారు! ఇంకేముంది, చుక్కెదురు కాదు.. చుక్కెదురుకు కూడా చుక్కెదురైందన్నమాట!
అక్కడ సీన్ కట్ చేస్తే.. ఇక్కడ సిట్ అధికారులు కాచుకు కూర్చున్నట్లు,కోర్టులో బెయిల్ దొరకలేదని తెలిసిన వెంటనే, ఆలస్యం అమృతం విషం
అన్నట్లుగా.. ఆఘమేఘాల మీద అరెస్ట్ వారెంట్ కోసం విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అంటే, ఇప్పుడు మిథున్ రెడ్డి గారి ‘మహోన్నత రాజకీయ జీవితంలో’ కొత్తగా చిప్పకూడు అధ్యాయం మొదలు కాబోతోంది అన్నమాట! దేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కాం అయిన దీనిని కూడా ఇంకా అమాయకంగా ‘రాజకీయ కక్ష సాధింపు’ అని, మిమ్మల్ని వదిలిపెట్టను, రెడ్ బుక్ రాజ్యాంగం
అని జగన్ గగ్గోలుపెట్టక మానడు.
ధనుంజయరెడ్డి నుండి చెవిరెడ్డి వరకు, ఇటు మిథున్ రెడ్డి నుండి తనవరకు తగులుకొనేలా చేసుకోవడం స్వయంకృతం. లక్షలాదిమందితో 5 ఏళ్లపాటు నిర్విఘ్నంగా.. విషం తాగించి, దోపిడీ చేసిన వేల కోట్ల పాపానికి తోడు, ఆ గబ్బు మద్యం తాగలేక కల్తీ మద్యం తాగి చనిపోయిన ఉసురులకు ఈ పాపాత్ములు మూల్యం చెల్లించే ఘడియలు వచ్చాయి.