– మారుమూల గిరిజన ప్రాంతాలలో తాగునీటి సదుపాయం సవాలుగా మారింది
– పార్లమెంటులో ఎంపీ రవిచంద్ర ఆవేదన
– డీపీఆర్ సమర్పించని కారణంగా జల్ జీవన్ మిషన్ పథకాన్ని మంజూరు చేయలేదని కేంద్ర మంత్రి జవాబు
ఢిల్లీ: తెలంగాణలో మిషన్ భగీరథ (జల్ జీవన్ మిషన్) అమలును కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందా? ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల వంటి గిరిజన, మారుమూల ప్రాంతాలలో తాగునీటి సదుపాయం ఒక సవాలుగా మారిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.
తెలంగాణలో “జల్ జీవన్ మిషన్” పనులపై స్వతంత్ర మూడవ పక్ష తనిఖీలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిన్నదా?
అని రాజ్యసభలో సోమవారం ఆయన “జల్ జీవన్ మిషన్”కు సంబంధించిన బడ్జెట్ పై చర్చలో పాల్గొంటూ ప్రశ్నించారు.ఎంపీ రవిచంద్ర లేవనెత్తిన ప్రశ్నలకు జలశక్తి మంత్రి సీ.ఆర్.పాటిల్ బదులిస్తూ,దేశం మొత్తంమీద “జల్ జీవన్ మిషన్”ఫథకంలో కేంద్ర ప్రభుత్వ సహాయం పొందని రెండు రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. వాటిలో ఒకటి బీహార్ కాగా,రెండవది తెలంగాణ అని,ఈ రెండు రాష్ట్రాలు కూడా తమ సొంత నిధులతో ముందుకెళ్లాయని చెప్పారు. ఇప్పుడు నిధులు కావాలని కోరుతున్నారని,కానీ ఆ పథకం గడువు ముగిసినందున ఆ రాష్ట్రాలను “జల్ జీవన్ మిషన్” చేర్చలేమని పాటిల్ స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం 2024లో ఈ పథకాన్ని మొదలు పెట్టడం జరిగీందని, దీనిని 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.ఈ విషయంలో ఆ రెండు రాష్ట్రాలు ఎటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)సమర్పించని కారణంగా ఈ పథకాన్ని మంజూరు చేయలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.