( మార్తి సుబ్రహ్మణ్యం)
తాజా ఎన్నికల్లో అనేక అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. వరసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఎదురులేదని నిరూపించుకున్నారు. శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్నాయుడు, హిందూపురంలో హీరో బాలకృష్ణ , టెక్కలిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఇచ్చాపురంలో బెందాళం అశోక్, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, అద్దంకిలో గొట్టిపాటి రవి, పర్చూరులో ఏలూరు సాంబశివరావు, విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్రావు, పాలకొల్లులో నిమ్మల రామానాయుడు హ్యాట్రిక్ సాధించి, తమ నియోజకవర్గాల్లో పట్టు కొనసాగించారు.