Suryaa.co.in

Telangana

హవ్వ.. బడిలో పాఠాలు వినాల్సిన పిల్లలు ఆసుపత్రి పడకలపైకి చేరుతున్నారు

– మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థినిని ప్రాణాల మీదికి తెచ్చింది. మార్చి నుంచి నవంబర్ వరకు లక్ష్మీ భవానీ కీర్తి అనే విద్యార్థిని 15 సార్లు ఎలుకలు కొరికితే అధికారులు ఏం చేసున్నట్లు? అనేక సార్లు ఆసుపత్రికి వచ్చినా ఎందుకు సరైన వైద్యం అందించలేదు? తీవ్ర అనారోగ్యం పాలై మంచం పడితే అధికారులు ఏం చేస్తున్నట్లు? ఇది అత్యంత అమానవీయ ఘటన.

అనేకసార్లు రాబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కాళ్లు చచ్చు పడిపోయాయిన దారుణమైన పరిస్థితి. గురుకులాల్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే, గురుకుల బాటతో పేరుతో ఒక్కరోజు ప్రచారం చేసి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ పాలనలో బడిలో పాఠాలు వినాల్సిన పిల్లలు, అనారోగ్యంతో ఆసుపత్రి పడకలపైకి చేరుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తీవ్రంగా అనారోగ్యం పాలైన లక్ష్మీ భవానీ కీర్తిని నిమ్స్ ఆసుపత్రికి తరలించి అత్యుత్తమ వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎలుకలు కొరికిన ఇతర విద్యార్థుల ఆరోగ్యాలు సంరక్షించాలని, మంచి వైద్యం అందించాలని కోరుతున్నాం.

LEAVE A RESPONSE