టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
మంగళగిరి పట్టణంలోని టిడ్కో గృహాలకు ప్రాణాంతకమైన తాగునీటి సరఫరా చూసి ఆందోళనకు గురయ్యాను. దాదాపు 9 వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతంతో పాటు ఏపీఐఐసీ, ఇతర సంస్థలకీ కలుషిత నీరు సరఫరా చేయడం దారుణం. స్థానికుల ఫిర్యాదుతో మా టిడిపి నేతలు ఫిల్టర్ బెడ్స్, పచ్చగా మారిన నీరు, అక్కడి అపరిశుభ్ర పరిస్థితులు పరిశీలించి నా దృష్టికి తీసుకొచ్చారు. టిడ్కో నివాసితులకి తక్షణమే సురక్షితమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి చేతకాకపోతే, మేము మా నిధులతో ఫిల్టర్ బెడ్స్ క్లీన్ చేయించి సురక్షితమైన తాగునీరు అందిస్తాం.