తిరుపతి: టీటీడీ పద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సింగిల్ జడ్జి ఆదేశాలపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అప్పీల్ చేసింది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై గతంలో సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని ధర్మాసనం కొట్టేసింది. భవనం ఆకృతుల్లో మార్పులు చేయొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది.
తిరుచానూరు పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌గా మార్చడంపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే విధించిన సంగతి తెలిసిందే. పద్మావతి నిలయాన్ని బాలాజీ జిల్లా కలెక్టరేట్‌కు వినియోగించడంపై హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి పిటిషన్ వేశారు.