-ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన ఏబీవీ
– తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని ఆరోపణ
– ఆ సమయానికి తనకు వేతనం కూడా ఇవ్వలేదని వెల్లడి
– 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
అమరావతి : ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంపై దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.ఈ సందర్భంగా ఏబీవీ తరఫు న్యాయవాది పలు కీలక అంశాలను కోర్టు ముందు ప్రస్తావించారు.
ఏబీవీపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న కోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు. అదే సమయంలో ఆ కాలానికి ఆయనకు వేతనం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఏబీవీ తరఫు న్యాయవాది వాదనల అనంతరం… ఈ విషయాలపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కౌంటర్ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల గడువు ఇచ్చింది.