• లోకేశ్ యువగళంపాదయాత్ర సాహసయాత్ర, జగన్ గతంలో చేసింది ఉత్త ఫ్యాషన్ షో. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీనేతల దోపిడీతో రాష్ట్రం నామరూపాల్లేకుండా పోయింది
• లోకేశ్ కు ప్రజలనుంచి లభిస్తున్న అపూర్వఆదరణతో వైసీపీనేతలకు పిచ్చిపట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు
• జీవోనెం-1 తీసుకొచ్చి పాదయాత్ర అడ్డుకోవాలని చూశారు
• 153 రోజుల్లో 2వేలకిలోమీటర్లు నడిచి, ఎక్కువమందితో సెల్ఫీలు దిగి, రికార్డు సృష్టించాడు
• లోకేశ్ పాదయాత్రకువచ్చిన జనాన్నిచూసి సీఎం కార్యాలయం మంత్రికి అక్షింతలు వేసింది
– యువగళం పాదయాత్ర ప్రదేశంలో (ఉదయగిరి) టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
“ ప్రజల సమస్యలు, వారి బాధలు అర్థంచేసుకుంటున్న లోకేశ్ సాధ్యసాధ్యాలు ఆలోచించే వారిసమస్యలు పరిష్కరిస్తానని చెబుతున్నాడు. టీడీపీప్రభుత్వం వస్తే ప్రజలకు మేలుచేసి చూపిస్తుంది అనే భరోసా కల్పిస్తున్నాడు. మత్స్యకారులు లోకేశ్ కు ఘనస్వాగతం పలికారు. గతంలో టీడీపీప్రభుత్వం ఇచ్చినవితప్ప, ఈ ప్రభుత్వం తమకు ఏమీఇవ్వలేదని వారు లోకేశ్ కు మొరపెట్టుకున్నారు. అలానే రొయ్యరైతులకు న్యాయంచేస్తానని లోకేశ్ హామీ ఇచ్చాడు.
లోకేశ్ పెద్దస్టార్ హీరో. 154 రోజులనుంచి జనంలో తిరుగుతున్నా, ఆయన క్రేజ్ తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో సరాసరిన వారంలో 4 రోజులు మాత్రమేనడిచి, 44కిలోమీ టర్లు పాదయాత్రచేశాడు. మా హీరో 100కిలోమీటర్లు నడిచాడు. తనవద్దకు వచ్చే వారందరితో లోకేశ్ మనసువిప్పి మాట్లాడుతున్నాడు. లోకేశ్ యువగళం యాత్ర సాహసయాత్రగా మారి, ప్రజలనుంచి ఆయనకు లభిస్తున్నస్పందనచూసి ఓర్వ లేకనే వైసీపీనేతలు, మంత్రులు పిచ్చివాగుడు వాగుతున్నారు.
డిస్కంలపై జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో మోపిన 70వేలకోట్లభారం, స్మార్ట్ మీటర్ల పేరుతో కొట్టేసే రూ.17వేల కోట్లు, మొత్తం 87వేలకోట్లు కట్టాల్సింది ప్రజలేగా!
ఎమ్మెల్యేలు, మంత్రులదోపిడీ ఒకపక్క, ముఖ్యమంత్రి దోపిడీ మరోపక్క. విద్యుత్ రంగాన్ని నాశనంచేశారు. స్మార్ట్ మీటర్లు పెట్టేనెపంతో రూ.17వేలకోట్లు కాజేయ డానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే డిస్కంలకు ఈప్రభుత్వం 70వేలకోట్లు బాకీ ఉం ది. 70వేలకోట్ల బాకీ ఉంది, మరో17వేలకోట్లు దోచుకుంటామని జనంలోకి వెళ్లి చెప్పండి. ఏమంటారో తెలుస్తుంది.
2014-19లో విద్యుత్ సరఫరాలో షార్టేజ్ వచ్చిందని ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీలంటూ కరెంట్ బిల్లులు పెంచారు. మరి జగన్ రెడ్డి విద్యుత్ రంగాన్ని నిర్వీర్యంచేసి రూ.87వేలకోట్లు కొట్టేస్తే, ఆ సొమ్మంతా ఎవరుకట్టాలి? రాజారెడ్డో.. రాజశేఖర్ రెడ్డో..కాకాణి గోవర్థన్ రెడ్డో కట్టరు. ఎప్పటి కైనా కట్టాల్సింది ప్రజలే.
రాష్ట్ర రైతాంగాన్ని జగన్మోహన్ రెడ్డి, అతని ప్రభుత్వం నిలువునా ముంచేసింది
రొయ్యల రైతుల్ని జోన్ నాన్ జోన్ పేరుతో ముంచేశారు. ధాన్యంరైతులకు కన్నీ ళ్లు మిగిల్చారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణం టీడీపీప్రభుత్వం 90శాతం పూర్తిచేస్తే, మిగిలిన 10 శాతం చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. అలానే సంగం బ్యారేజీని మేం 75 శాతం పూర్తిచేస్తే, మీ ప్రభుత్వం 25 శాతం పూర్తిచేయడానికి నాలుగేళ్లు పట్టింది. రివర్స్ టెండరింగ్ అనిచెప్పి, సోమశిల హైలెవల్ కెనాల్ పనులు ఆపేశారు.
కావలి, బెంగుళూరులో వేలకోట్లున్న ప్రతాప కుమార్ రెడ్డి, సిగ్గులేకుండా మట్టి, ఎర్రమట్టి, బూడిద అమ్ముకుంటున్నాడు
కావలి వైసీపీఎమ్మెల్యే వచ్చేఎన్నికల్లో గెలవడని ఆయన పార్టనర్ సుకుమార్ రెడ్డే చెబుతున్నాడు. వలి, బెంగుళూరులో వేలకోట్లు ఉన్న ప్రతాపకుమార్ రెడ్డి, ఎర్రమట్టి అమ్ముకోవడం సిగ్గుచేటుకాదా? బూడిద, మట్టి, ఎర్రమట్టి, కొండలు, ఇలావేటినీ ప్రతాప్ కుమార్ రెడ్డి వదలడంలేదు. రాత్రికాగానే ఆరోజు వచ్చిన డబ్బులు లెక్కపెట్టకపోతే నెల్లూరు జిల్లా వైసీపీనేతలు, మంత్రులకు నిద్రపట్టదు.
ప్రజలు వైసీపీనేతల దోపిడీ గురించి చెబుతున్నారుతప్ప, వారుచేసిన మంచి గురించి ఎక్కడైనా చెబుతున్నారా? వైసీపీనేతలు, మంత్రుల అనుచరులు ఫేస్ బుక్ లోపెట్టే ఫొటోలు, కామెంట్స్ చూస్తుంటే నవ్వొస్తోంది. మొన్న సీఎం కార్యాల యంనుంచి మంత్రికి దొబ్బులు పడ్డాయి.
ముత్తుకూరులో లోకేశ్ పాదయాత్రకు అంతప్రజాస్పందన ఎందుకువచ్చిందని అడిగితే, ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేశారని చెప్పి తప్పించుకున్నాడు. లోకేశ్ దెబ్బతో మంత్రికే సీఎంపేషీ నుంచి అ క్షింతలు పడ్డాయి. ముందుముందు చాలా జరుగుతాయి. లోకేశ్ ప్రభంజ నాన్ని ఎవరూ ఆపలేరు.”