– వైన్ షాపుల తాట తీశారు
– ఎక్సైజ్ అధికారులకూ వార్నింగ్ ఇచ్చారు
– ఎమ్మెల్యే కొలికపూడి చర్యకు జనం ఫిదా
తిరువూరు: అటు వైన్స్ షాపు. ఇటు బెల్ట్ షాప్. మద్యలో మందుబాబుల అలజడి. ఇంకేముందీ తిరువూరు ఎమ్మెల్యేకి కోపం వచ్చింది. అంతే తానే స్వయంగా బెల్డ్ తీశారు. ఈ షాపులు నడిపితే తాటతీస్తానని హెచ్చరించారు. ఎన్డీఆర్ జిల్లా తిరువూరులో ఈ ఘటన సంచలనం రేపింది. తిరువూరు నియోజక వర్గంలోని మద్యం బెల్ట్ షాపులను 24 గంటల్లో తొలగించాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు.
తిరువూరు మండలంలో 43, నియోజకవర్గ పరిధిలోని సుమారు 130 పైగా బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు .. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే వైన్ షాపుల లైసెన్స్ లను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా, పాఠశాలలు, గృహాలు, బస్టాపుల సమీపాల్లోని 4 మద్యం షాపులను ఎమ్మెల్యే కొలికపూడి స్వయంగా మూయించారు.
పట్టణంలో మద్యం వికయిస్తున్న బెల్ట్ షాపులను తనిఖీ చేసి, పోలీసులకు పట్టించారు. పట్టణంలోని నాలుగు మద్యం దుకాణాల్ని పట్టణ శివారుకు తరలించాలని సూచించారు .. ఇక ఎమ్మెల్యే చర్యలకు తిరువూరు ప్రజానీకం ఫిదా అయ్యారు.