– చెక్కును పంపిణీ చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
అమరావతి: రోడ్డు ప్రమాదంలో మరణించిన అనంతపురానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ వి. నారాయణ నాయక్ కుటుంబానికి కోటి రూపాయల చెక్కును బుధవారం తన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పంపిణీ చేశారు. విధుల్లో ఉండగా మరణించిన పోలీస్ సిబ్బందికి ఎస్బీఐ పోలీస్ శాలరీ ప్యాకేజీ లో భాగంగా ఈ సాయాన్ని నారాయణ నాయక్ సతీమణి శాంతిబాయికి అందజేశారు. అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ జనవరి 17, 2025న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఫిబ్రవరి 7, 2025న నారాయణ నాయక్ మృతి చెందారు. నారాయణ నాయక్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీపీ(పీ అండ్ ఎల్) ఎం.రవిప్రకాష్, సీఏవో రాజన్, అనంతపురం ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.