Suryaa.co.in

Andhra Pradesh

చెట్లతోనే క్షేమం

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్

చెట్లు ఉంటే..మానవాళికి, భువికి క్షేమం అని, హరితం హరిస్తే క్షామమే కాబట్టి పర్యారణం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. ఆయన తన మాతృమూర్తి విజయతో కలసి మొక్కల్ని నాటారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..ప్రాణ వాయువు ను ఉత్పత్తి చేయడంతో పాటు వాతావరణ సమతుల్యత కు చెట్ల పెంపకం తో నే సాధ్యం అన్నారు.ఇంటికి ఓ చెట్టు ఉంటే..ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు.జామ, వేప, మామిడి,వంటి చెట్లు ఇంటికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు.రానున్న వర్షాకాలం లో ,విధిగా ప్రతి ఒక్కరూ.. చెట్లను నాటాలని పిలుపు నిచ్చారు. చెట్లు ఉంటే క్షేమం లేకుంటే క్షామమే అని అభిప్రాయ పడ్డారు.

LEAVE A RESPONSE