Suryaa.co.in

National

గుజరాత్ లో భారీ వరదలు

– నిస్వార్థంగా సేవలందిస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తలు

మొన్నటికి మొన్న కేరళలోని వయనాడ్ లో ప్రకృతి బీభత్సం జరిగింది. దీంతో చాలా మంది చనిపోయి, నిరాశ్రయులయ్యారు. ఈ సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రంగంలోకి దిగి, ప్రచారానికి అత్యంత దూరంగా వుంటూ సమాజానికి సేవ చేశారు.

ప్రజలు, ఇబ్బందులున్న వారికి సేవలు చేశారు. ఆరెస్సెస్, సేవా భారతి కార్యకర్తలు చేసిన సేవలను అక్కడి చర్చి పాస్టర్లు కూడా బహిరంగంగానే మెచ్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆరెస్సెస్ కార్యకర్తలు గుజరాత్ లో చేస్తున్నారు. తాజాగా గుజరాత్ లోని వడోదర, ద్వారక, మోర్బి, రాజ్ కోట్, ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్ లలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

చాలా మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 10 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ సమయంలో ఆరెస్సెస్ కార్యకర్తలు రంగంలోకి దిగి, ఎప్పటిలాగే ప్రచారానికి దూరంగా సమాజ సేవ చేస్తున్నారు.విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కొంటూ.. సేవలు చేస్తున్నారు.కార్మికులు, మహిళలు తమ తమ పిల్లలతో సహా చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రాధాన్యమిస్తున్నారు.

మారుమూల ప్రాంతాల్లో వున్న వారికి ఆహార సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. ఒక్క జామ్ నగర్ లోనే 80 మంది ఆరెస్సెస్ కార్యకర్తలు రక్షించారు. అలాగే సౌరాష్ట్ర ప్రాంతంలో గర్భవతులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతంలో సుమారు 2 వేల ఆహార ప్యాకెట్లను అందజేశారు.

రాజ్ కోట్ లో ప్రత్యేక వంట గదిని ఏర్పాటు చేసి, ప్రతి రోజూ వెయ్యి మందికి సేవలు చేస్తోంది. అలాగే టంకారా, జామ్ నగర్ లో కూడా ఆహార ప్యాకెట్లను సుమారు 150 మంది స్వయంసేవకులు అందజేస్తున్నారు. వడోదర ప్రాంతంలో డాక్టర్ హెడ్గేవార్ సేవా కమిటీ వారు బాధితుల తరలింపులోనూ, ఆహార పంపిణీలోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నారు.

వడోదర ప్రాంతంలో తీవ్రమైన స్థాయిలో వరదలు వచ్చాయి. దాదాపుగా ఇళ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. అయినా సరే స్వయంసేవకులు ముందంజలో వుంటూ సేవలు చేస్తున్నారు. మరో వైపు వరదలపై ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా వివరించారు. విపత్తును ఎదుర్కోవడానికి రాష్ట్రానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE