హైదరాబాద్ ను మరోసారి జడిపించిన భారీ వర్షం..

-మరో రెండు రోజుల అలర్ట్ 
-హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది
– నగరంలోని ఎల్బీనగర్, మన్సూరాబాద్‌, నాగోల్, వనస్థలిపురం, సికింద్రాబాద్​లో వర్షం కురిసింది
– ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్​ జామ్ అయింది
– రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది

ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఎల్బీనగర్, మన్సూరాబాద్‌, నాగోల్, వనస్థలిపురం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వరుణుడి రాకతో వాహనదారులు తడిసి ముద్దయ్యారు. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, బేగంపేట్‌, చిలకలగూడ, కూకట్‌పల్లి, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట్, మూసాపేట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో నగరవాసులకు గత కొన్ని రోజులుగా ఉన్న వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించింది.

నగరంలోని ఫలక్‌నుమా, కాలాపత్తర్, చాంద్రాయణగుట్ట బహదూర్‌పురా, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్‌, వికారాబాద్‌ ప్రాంతాల్లో వర్షం పడింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, మూసాపేట్‌, నాచారం, కాప్రాలోనూ వరుణుడు దంచికొట్టాడు. ఒక్కసారిగా వరుణుడు రావడంతో భారీగా ట్రాఫిక్​ జామ్ అయింది. పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి రహదారులపై చేరిన వర్షం నీటిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.

రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ… ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కి మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని… ఈ ఆవర్తన ప్రభావంతో తదుపరి 48గంటలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాని సంచాలకులు వివరించారు.

Leave a Reply