(భోగాది వేంకట రాయుడు)
*అల్లోల్లో… ల్లో…. ల్లో….!”
“అల్లోల్లో…. ల్లో…. ల్లో….” “మీతో ఓ బిజినెస్ పని మీద వచ్చానండి. అట్టా గదిలోకెల్లి మాట్టా డుకుందాం….!”
“వద్దులెండి.. గోడలకు సెవులుంటై. ఇక్కడే మాట్టాడుకుందాం….!”
“ఏం లేదండి…. మావోడు లిక్కర్ స్కాంలో దొరికిపోయాడండి. ఆడికి బెయిల్ ఇప్పియ్యాలండి…. ఎంతయిద్ది!? ”
“ఓస్ అంతేనా….!?”
“అంతేనా అంటే…. అంతే కాదండి! ఆడికొ ఫ్రెం డున్నాడండి. ఆణ్ణి కూడా లోపలేశారండి. ఆణ్ణి కూడా బయటెయ్యాలండి. ఎంతయిద్ది?”
“ఓస్ అంతేనా?”
“అంతేనా అంటే… అంతే కాదండి! మావోడి ఫ్రెండ్స్ కూడా లోపలే ఉన్నారండీ…! ఆళ్ళనీ బయటెయ్యాలండి!. ఎంతవుద్ది!?”
“ఓస్. అంతేనా!ఇంకా ఉన్నయ్యా?”
ఆ జైలు లోనే మావోడి ఫ్రెండ్స్ ఇంకో నలుగురు మా ఊరోళ్ళే ఉన్నారండీ. వాళ్లకు చచ్చినా బెయిల్ రాగూడదండీ… ఎంతవుద్ది?
“అంతేనా? ”
అంతేనా అంటేనా అంటే… అంతే కాదండి. మనకో సెటప్ ఉందండి. దాని మొగుడు ఎలచ్చన్ లో పోటీ సేత్తన్నాడండి…. ఆడు గెలవ గూడదండి…. ఎంతవుద్ది!?
ఇంతేనా… ఇంకేవన్నా ఉన్నాయా!?
అంతేనా అంటే…. ఇంకా శానా ఉన్నయ్యి. ముందు రేట్లు తేల్చండి. మా బామ్మర్దికి బెయిల్ ఇప్పిస్తే ఎంతవుద్ది? ఆడి ఫ్రెండ్స్ కి బెయిలు ఇప్పిస్తే ఎంతవుద్ది? … కొంతమందికి బెయిల్ రాకుండా చేస్తే ఎంతవుద్ది!?
మా సెటప్ కి ఓ మొగుడున్నాడండి. ఆడు ఎలచ్చన్ లో పోటీ చేత్తన్నాడు. ఆడిని ఓడియ్యాలి. ఎంతవుద్ది? ఆణ్ణి ఓడించడానికి, ఆ సీట్లో నన్ను కూకోబెట్టడానికి ఎంతవుద్ది? ”
“అంతేనా? ఇంకా ఉన్నాయా!? ”
” ఉన్నాయా అంటే బోలెడన్ని ఉన్నాయండి
మొత్తం ఇసక అయితే ఏంటి…. సారా అయితే ఏంటి… మైన్సయితే ఏంటి… కాంట్రాక్టుల కమిషన్లు అయితే ఏంటి…. కబ్జాలు, ఫోర్జ్ రీలు అయితే ఏంటి…. మర్దర్లు అయితే ఏంటి…. రేపులైతే ఏంటీ…. చీటింగులైతే ఏంటి…. చైను స్నాచింగులైతే ఏంటి…. పిక్ పాకిటింగులైతే ఏంటి…. గుళ్ళల్లో దీపారాధనల్లో చుట్టలు, బీడీలు వెలిగించుకున్న కేసులైతే ఏంటి…. దేవుడి గుళ్ళల్లో పులిహారల్లో కల్తీ చింతపండు కలిపేసిన కేసులైతే ఏంటి..
మా జిల్లాలో ఓ వెయ్యి దాకా ఉన్నయ్. అయన్నీ మాఫీ చేసేసి…… అవన్నీ ఎగస్పార్టీ వాళ్ళ మీద పెట్టించాలి. ఎంతవుద్దీ!?
కన్సషన్ ఏమైనా ఉందా మీకూ నాకూ కంప్రమైజేషన్ కుదిరితే హోల్ మొత్తం జిల్లా అంతా మీ చేతుల్లో పెడతా. నాకు నూటికి ఓ పది పర్సెంట్ కమిషన్ ఇవ్వండి….”
“ఇదంత అర్రీ బుర్రీ గా తేలే యవ్వారం కాదు. మా సెగట్రీ ఆంజనేయులు రేట్ లిస్ట్ చూసి చెబుతాడు….. ”
“…. సూడు ఆంజనేయులూ…. ఈడు నిజంగా బిజినెస్ పని మీదే వచ్చాడా… లేకపోతే మనగురించి కూపీ ఎవన్నా లాగడానికొచ్చాడా…ఏంటి…సూడు. డౌట్ వొచ్చిందా… గొడ్డలుచ్చుకు నరికెయ్. ఆ ముక్కలు తీసికెళ్లి చంద్రబాబు పక్కలో పడేయ్…. వాళ్ళు… వాళ్ళు చూసుకుంటారు. మనం వెళ్లి పరామర్శించి వద్దాం.
” యస్సర్…. మరి నా ప్రమోషను…..!!”
“సూద్దాం లెద్దూ… ఎదవ ప్రమోషనూ…!! మధ్య మధ్య లో ఇట్టాంటి పనులు కూడా చెయ్యక పోతే… ఇక నీకూ మడిసికీ తేడా ఏటుంటది “?*