Suryaa.co.in

Andhra Pradesh

అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను ఆదుకోండి

– జాతీయ మానవహక్కుల సంఘానికి ఏపీ బిజెపి నేతలు నాగోతు రమేష్ నాయుడు, రఘు, భాస్కర్ ఫిర్యాదు

అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశాలివ్వాలని ఏపీ బీజేపీ కోరింది. ఆ మేరకు రాష్ట్ర బీజేపీ నేతలు పురిఘళ్ల రఘురాం, బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు, భాస్కర్ సోమవారం ఢిల్లీలోని జాతీయ మానస హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు ఏమన్నారంటే..

అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుపోయిన ఘటనలో భాధితులకు న్యాయం చేయాలి. 60 రోజులలో ఇళ్లు కట్టిస్తామన్న హామీని సీఎం నెరవేర్చలేదు. రైతుల పంట పొలాల్ని సాగుకు ఆమోదయోగ్యంగా మార్చుతామన్న హామీని నిలబెట్టుకోలేదు. దీనివల్ల ఇప్పటి వరకు మూడు పంటలు నష్టపోయారు. ప్రాజెక్ట్ ప్రమాదానికి కారకులయిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. భాధితులు తమ పంట పొలాలపై తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి.

సీఎం సొంత జిల్లాలో ఇసుక మాఫియా వల్ల జరిగిన ఘటన పై , ఇప్పటి వరకు సమగ్ర దర్యాప్తు జరగలేదు, కేసులు నమోదు చెయ్యలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఘటనపై సమగ్ర నివేదిక కోరతామని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ సభ్యుడు జ్ఞానేశ్వర్ ముల్లే హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE