Suryaa.co.in

Andhra Pradesh

ఇలా అయితే వాళ్లు పనులు ఎలా చేస్తారు?

-గోపాలకృష్ణ ద్వివేది, రావత్‌, కొన శశిధర్‌‌పై హైకోర్టు ఆగ్రహం

వెలగపూడి : ఉపాధి బిల్లుల చెల్లింపు కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు సీరియస్‌ అయ్యింది. కోర్టుకు హాజరైన ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, రావత్‌, కొన శశిధర్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్నూలులో ప్రభుత్వం డబ్బు ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్‌ వ్యవహారంపై న్యాయమూర్తి బట్టు దేవానంద్‌ అధికారులను నిలదీశారు. ఆ కుటుంబానికి ఎవరు ఆసరా కల్పిస్తారని ప్రశ్నించారు. ఒకటి, రెండు కేసుల్లో అయితే కోర్టు ధిక్కారం ఉంటుందని, అన్ని ఆర్డర్స్‌లో కోర్టు ధిక్కార కేసులు నమోదయితే ఎలా? అని ప్రశ్నించారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జరిగిన చెల్లింపుల స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. డబ్బులు అప్పు తీసుకొచ్చి పనులు చేసినప్పుడు వారికి బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు ఇలా అయితే పనులు ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ.. కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు.

LEAVE A RESPONSE