రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల ఆఘాడాలను అరికట్టి, అధిక ఫీజులను నియంత్రించాలి: ఏబీవీపీ
తెలంగాణలో కార్పొరేట్ కళాశాలలు అధిక ఫీజుల కోసం వేధిస్తున్నా,అనుమతి లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్నా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ,అధికారుల తీరును నిరసిస్తూ ఏబీవీపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు..
1.రాష్ట్రవ్యాప్తంగా నేడు ఆగస్ట్ 22న అన్ని ఇంటర్ కార్పొరేట్ కళాశాలల ముందు ధర్నా కార్యక్రమాలు
2.ఆగస్ట్ 23 మంగళవారం నాడు జూనియర్ కళాశాలల బంద్…
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ , విద్యా శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ధనదాహంతో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా కార్పొరేట్ విద్యాసంస్థల ఆఘడాలపై అయన గత ఎనిమిది సంవత్సరాల నుండి కార్పొరేట్ శక్తులు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తూ ప్రభుత్వ అనుమతులు లేకుండా,మార్గదర్శకాలను విస్మరిస్తూ అక్రమంగా సంస్థలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని,ఇంటర్ కళాశాలలు అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహించినా,నిబంధనలు ఉల్లంగిస్తున్నా తీవ్రమైన ఘటనలు మినహాయిస్తే విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
హైదరాబాద్ నగరం సహా ఇతర అన్ని జిల్లాల్లో విస్తరించిన నారాయణ,శ్రీచైతన్య లకు తోడు మరిన్ని కార్పొరేట్ శక్తులు ఇంటర్ విద్యలో పాగావేసి తప్పుడు ర్యాంక్ లతో ప్రచార అర్బాటాలతో ఒత్తిడితో కూడిన కాసుల చదువులకు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తూ ఒకే పేరుతో వందల బ్రాంచులు నిర్వహించినా లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ కళాశాల ఒకటైతే ఫీజు చెల్లించుకునే కంపెనీ మరొకటి, వేరే సంస్థ పేరిట రషీదు ఇస్తూ నల్లధనం ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుంది. కార్పొరేట్ మాఫియా PRO వ్యవస్థ ద్వారా ముందస్తుగానే అడ్మిషన్స్ చేపడుతూ ఒక్కొక్కరికి ఒక్కో ఫీజు నిర్ణయించడమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులను వివిధ కోర్సుల పేర్లతో MPC ( Super china , China program, CO program , N1 20, Star C ), BIPC ( Aims Super 60, CO Programs, E L I T Batches, Semi Residential , Medicon ) లక్షల రూపాయలను దండుకుంటున్న ఘటన బహిరంగ రహస్యమే అయినా విద్యాశాఖ మంత్రి గాని,ఇంటర్ విద్యా అధికారులు చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు.
అడ్మిషన్ పొందిన రోజు 60% ఫీజు చెల్లించాలనే షరతు,పుస్తకాలు,యూనిఫామ్ లు తమ ప్రాంగణంలోనే విక్రయించడం నిబంధనలకు విరుద్ధమైనా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు.విద్యాసంవత్సరం పూర్తి అయినా సర్టిఫికెట్స్ ఇవ్వకుండా అధిక ఫీజుల కోసం తీవ్ర వేదింపులకు గురి చేస్తుండడంతో ఫీజు చెల్లించలేక, సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో పై చదువులకు వెళ్లే అవకాశం కోల్పోతున్నామన్న బాధతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.ఇదే తరహాలో రామంతపూర్ నారాయణ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన సాయి నారాయణ స్వామి అనే విద్యార్థి సర్టిఫికెట్లు తీసుకోవడం కోసం కళాశాలకు వెళ్లగా అధిక ఫీజు నమోదు చేసిన యాజమాన్యం పూర్తి ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలయాపన చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండడంతో యజమాన్యం వైఖరిపై విసుగు చెందిన విద్యార్థి విధి లేక తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేయడం అత్యంత బాధాకరమని ఈ ఘటన అధిక ఫీజు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పీలుస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల ఆఘాడాలు అవగతమౌతోంది.
ఇది కేవలం రామంతాపూర్ కు పరిమితమైన సమస్య కాదని రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇదే విధమైన దుర్మార్గాలు కొనసాగుతున్న్నాయి.ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కళాశాల సీజ్ చేసి కఠినంగా వ్యవహారించాలని,ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కళాశాలకు అనుబంధంగా హాస్టల్స్ నిర్వహిస్తూ అధికారులను తప్పు ద్రోవ పట్టిస్తున్న కళాశాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలి.కార్పొరేట్ శక్తుల ఆఘాడాలను అరికట్టి,అధిక ఫీజులు నియంత్రించేలా ప్రభుత్వం, ఇంటర్ బోర్డ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా
-నేడు ఆగస్ట్ 22న అన్ని ఇంటర్ కార్పొరేట్ కళాశాలల ముందు ధర్నా కార్యక్రమాలు
-ఆగస్ట్ 23 మంగళవారం నాడు జూనియర్ కళాశాలల బంద్ పిలుపునిచ్చారు.