అన్నం అయితే చిన్న పాత్ర అయినా పెద్ద గుండిగే అయినా చూసే పద్ధతి ఒక్కటేఅదే ఓ మెతుకు చూస్తే చాలు
అలాగే….
బక్ష్యాలు (కూరలు/పిండి వంటలు) వాటి ఘుమఘుమలాడే ఘుమఘుమలే తెల్చేస్తాయి అన్నది ఎంత బలమైన నిజమో మనందరికీ స్వానుభవమే…!
కొందరి రచనా ప్రక్రియలో కొన్ని పడి కట్టు పదాలు ప్రయోగించడం
ఉదాహరణ కు…
“జననానికి తొమ్మిది నెలలు….మరణానికి తొమ్మిదే క్షణాలు”
అలాగే కొన్ని ఉద్వేగభరిత అంశాపూరిత భావోద్వేగ కథా సంపుటాలు చదివి కళ్ళు చెమర్చనీ పాఠకులు ఉండరు..!
అలాగే వీరు వాడే భాష అనేది చాలా సున్నితమైనది. ఛందస్సులు/సమాసాలు వ్యాకరణాలు సుధీర్ఘ పదాల దొంతరలు
లేకుండా/కాకుండా అతి సాధారణ పాఠకుడు /శ్రోత కూడా చాలా తేలికగా సులువుగా సులభతరంగా అవగతం అవుతుంది… ఇదే ఇదే వీరి ప్రతిభకు ప్రశంసలకు ప్రధాన భూమిక…!
అలాగే వీరి కర కమలములతో వ్రాయ బడిన ప్రతిదీ అది కథ కథానిక ఏదైనా కావచ్చు…
చదివిన వారందరికీ అది వారి వారి స్వీయ అనుభవమా?….చిర పరిచయమా…అన్నట్లుగానే ఉంటుంది…!
అది ఓ అమ్మ ప్రేమ….
ఓ అమ్మ నిస్పృహ…ఓ తల్లి తండ్రుల నిరాదరణ కధా మంజరి….మురికివాడల దుస్తితి గురుంచి కావొచ్చు.. అలాగే..
ఓ అనాథ/వృద్ధాశ్రమం..దైన్య స్థితి అందులోని వృద్ధుల ప్రేమ కోసం తపన, తమకం, ఆర్తి, ఆవేదన గురుంచి సవిస్తార విశ్లేషణ….
ఇలా ఇలా
ఓ బంధువు మమకారం,
ఓ అజ్ఞాని అనుభవ రాహిత్యం
ఓ స్నేహశీలి ఔదార్యం
ఓ రైలు ప్రయాణం
ఓ రాజకీయ నాయకుని
అప్రకటిత సమాచార సంపుటి
మరో రాజకీయ దురంధరుని చాణక్య నీతి నేపథ్యం
ఇలా ఇలా
ఎన్నో ఎన్నెన్నో కొంగ్రొత్త అంశాలు…వారి కలంలోంచి వచ్చేనిర్భీతి నిజాలు సగటు మనిషి కిపాఠ్యాంశాలు గా
సజీవంగా నిలిచి పోతాయి అనేది అక్షర సత్యం…!
శ్రీపాద శ్రీనివాసు మొదటి సంకలనం గుండె చప్పుళ్ళు చదివాను
ఆ ప్రేమ కరుణ భాద భావం భావనా వేరు…అమ్మలోని అమ్మతనం కమ్మదనం వడ్డించిన విస్తరి అనేది ఓ పాఠకునిగా నా స్పందన
అలాగే….
రెండవ సంచలనం
(సంకలనం)
చట్ట సభల్లో గోదావరి గళం చదివా…ఇది మరో అద్భుతమైన ఆఖ్యానం…
ఎందుకంటే ఎంతో మంది రాజకీయ నేతలద్వారా పుణికి పుచ్చుకున్నవిభిన్న విలక్షణ రాజకీయ వ్యాసంగ చతురత
చెట్టు ముందా విత్తు ముందా అనగా
వీరి స్వానుభవాలను మనకు పంచుతున్నారా ???….లేక
సమాజ మనుగడ కోసం జరుగుతున్న ఘటన సంఘటనలను విశ్లేషించి మనకు అవగాహన కల్పిస్తున్నారా !?!??!
అనట్లుగా
చక్కని ప్రేరణ కలిగించే విభిన్న కథా సంపుటాల సమ్మేళనం …అందుకు ప్రేరణ విభిన్న ప్రాంతాల రాజకీయ నాయకుల
పరిచయాలు…వారి వారి స్వభావ రీత్యా అనుభవ పాఠాలు…కొన్ని సందర్భాల్లో వీరి రచనా ప్రక్రియలోసుస్పస్టం గా గోచరిస్తుంది…!
అలాగే
ఈనాటి మూడవ సంకలనం మనసున ఉన్నది ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలుపుతూ
అలాగే తాను రచించిన కథను తానే నేరుగా ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం ద్వారా చెప్పుకొనే అదృష్టం అవకాశం దక్కించుకోవడం అది కూడా వివిధ పర్యాయాలు పొందడం కూడా పూర్వ జన్మ సుకృతం అని భావిస్తూ…కొంత మంది
మహానుభావులు తమదైన శైలిలో చెప్పినట్లుగా ఆకాశ విస్తీర్ణం సముద్రపు లోతు తెలుసుకోవచ్చు నేమో గానీ మన శ్రీనివాస్ కథ కథానిక కథనం సంకలనం యొక్క విశేషం విశిష్ట విశేష విస్తృత స్థాయిని అంచనా వేయడంవాటి పరిమళ గుభాళింపును వివరించడం సూర్యుడు ముందు దివిటీ లా ఉంటుందని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
– పెండ్యాల ప్రభాకర శర్మ
తెలుగు భాషావేత్త
, బెంగుళూరు
8688289451