Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు సెలవులు పొడిగించాలి

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా విద్యార్థులకు సెలవులు పొడిగించాలి
– ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం వి ప్రణవ్ గోపాల్ డిమాండ్

విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆలోచించలేని పరిస్థితిలో విద్యాశాఖమంత్రి ఉండటం దురదృష్టకరం.పాఠశాలలో ముందస్తు ఏర్పాట్లు లేకుండా యధావిధిగా కొనసాగించటం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమే.విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రుల ఆందోళన దృష్ట్యా సెలవులు పొడిగించాలి.15 సంవత్సరాల లోపు వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాకుండా విద్యార్థులకు పాఠశాలలు నిర్వహించడం దుస్సాహసమే అవుతుంది.గతంలో కోర్టు లతో మొట్టికాయలు వేయించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా విద్యార్థుల విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము లేదు.విద్యా వ్యవస్థను ఎలా నడపాలో అవగాహన లేని విద్యాశాఖ మంత్రి ,రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరం.

కరోనా వ్యాప్తి దృష్ట్యా పరిస్థితులు సద్దుమణిగే వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించాలి.కరోనా విషయంలో ప్రభుత్వ గణాంకాలు రోజురోజుకి పెరుగుతున్నప్పటికి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది.విద్యార్థులకు మూడో వేవ్ వ్యాప్తి దృష్ట్యా పాఠశాలలో తగిన ఏర్పాట్లు లేకపోవడం వలన విద్యార్థులకు వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ.విద్యార్థుల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలు ఆడుకుంటుంది.పాఠశాలలు యధావిధిగా ప్రారంభించి విద్యార్థులలో కరోనా వ్యాప్తికి కారణం అయితే దానికి బాధ్యత ప్రభుత్వం వహించాలి.ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడ్డా దాని బాధ్యత ముఖ్యమంత్రి తీసుకుంటాడా?విద్యార్థుల పట్ల మూర్ఖంగా ప్రవర్తించే ముఖ్యమంత్రి దొరకటం కడు శోచనీయం.పాఠశాలలు యధావిధిగా కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఏపీ టిఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది.

LEAVE A RESPONSE