Suryaa.co.in

Andhra Pradesh

సచివాలయంలో హోంమంత్రి తానేటి వనిత జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత జన్మదిన వేడుకలు సచివాలయం లోని రెండవ బ్లాక్ లో ఘనంగా జరిగాయి. క్యాబినెట్ మీటింగ్ కు హాజరయిన హోంమంత్రి తానేటి వనిత కు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్యాబినెట్ మంత్రులు, అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, సిబ్బంది హోం మినిస్టర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. క్యాబినెట్ మీటింగ్ అనంతరం సచివాలయం రెండవ బ్లాక్ లో హోంమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రత్యేకంగా హోంమంత్రి చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సిబ్బంది హోంమంత్రి తానేటి వనిత చే కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. శాలువాలు, బొకే లతో హోం మినిస్టర్ ను సన్మానించి అభిమానం చాటుకున్నారు. బర్త్ డే సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కి, సహచర మంత్రులకు, వైస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు తానేటి వనిత ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A RESPONSE