Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీఆర్ బొమ్మ ఉందని ఇళ్లపనులు నిలిపివేశారు!

– లోకేష్ ఎదుట డక్కిలి ఎన్టీఆర్ కాలనీ వాసుల ఆవేదన

• వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి ఎన్టీఆర్ కాలనీని యువనేత నారా లోకేష్ సందర్శించారు.
• ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ… 2015-16లో 60మందికి ఇక్కడ ఇళ్లు మంజూరు చేశారు.
• వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాకు బిల్లులు ఇవ్వకుండా పనులను అర్థంతరంగా నిలిపేశారు.
• మాకు బిల్లులు ఇప్పించి రోడ్లు, నీళ్లు, కరెంటు సౌకర్యం కల్పించాలని వైసిపి నాయకులను అడిగితే, ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ బొమ్మ కూల్చేస్తే సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
• మేం అభిమానంతో ఏర్పాటుచేసుకున్న విగ్రహాన్ని కూల్చబోమని ఖరాకండీగా చెప్పాం.
• దీంతో గత నాలుగేళ్లుగా మాకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారు.

నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకానికి డక్కిలి ఎన్టీఆర్ కాలనీ పరాకాష్ట.
• ఎన్టీఆర్ బొమ్మ కూల్చేస్తే సౌకర్యాలు కల్పిస్తామనడం శాడిస్టు లక్షణాలు కాదా?
• కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్థంతరంగా నిలిచిపోయిన 2లక్షల ఇందిరమ్మ ఇళ్లకు మేం అదనంగా ఆర్థిక సాయం అందించి పూర్తిచేశాం.
• పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సైకో ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డక్కిలి ఎన్టీఆర్ కాలనీ ప్రజలకు సకలసౌకర్యాలతో ఇళ్లు పూర్తిచేసి అందిస్తుంది.

LEAVE A RESPONSE