Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి చేసిన అప్పులు తక్కువని దువ్వూరి కృష్ణ ఎలా చెబుతాడు?

-రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు రమ్మంటే రాకుండా, వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి చేసిన అప్పులు తక్కువని దువ్వూరి కృష్ణ ఎలా చెబుతాడు?
-టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పుల్లో కార్పొరేషన్లు, బ్యాంకులరుణాలు, కాంట్రాక్టర్ల బకాయిలు, గ్యారంటీ-నాన్ గ్యారంటీ రుణాలన్నీ కలిపిన జగన్ సర్కార్, ఈ మూడేళ్లలో చేసిన అప్పుల్లో మాత్రం కేవలం ఆర్బీఐ అనుమతితో చేసిన రుణాలుమాత్రమే అప్పులని ఎలా చెబుతుంది?
• రాష్ట్ర ఆర్థికస్థితి, అప్పులపై ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ రెండునాల్కల ధోరణితో మాట్లాడాడు
• టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019మార్చి నాటికి రూ.3,62,375కోట్ల అప్పులు చేసిందని, 2019 జూలైలో వైసీపీప్రభుత్వమే శ్వేతపత్రం విడుదల చేసింది
• ఆ అప్పుల జాబితాలో ప్రభుత్వఅప్పులతో పాటు, కార్పొరేషన్ల అప్పులు, గ్యారంటీ-నాన్ గ్యారంటీ రుణాలన్నీ చూపింది
• టీడీపీ ప్రభుత్వ అప్పుల్లో అన్నిరుణాలు చూపిన జగన్ రెడ్డి ప్రభుత్వం, ఈమూడేళ్లలో తాను చేసిన రుణాల్లో మాత్రం కేవలం ఆర్బీఐ రుణాలనే అప్పులుగా ఎలా చూపుతుంది?
• వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బులు, పెండింగ్ బిల్లులు అప్పుల్లో కలపకూడదంటున్న ప్రభుత్వాధికారులు, టీడీపీప్రభుత్వానికి మాత్రం అవన్నీ ఎలా అంటగట్టారో సమాధానం చెప్పాలి
• అప్పులు తక్కువై, రాష్ట్రఆర్థికపరిస్థితి బాగుంటే ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించడంలేదో కృష్ణ సమాధానం చెప్పాలి
• జగన్ ప్రభుత్వం తమకు బకాయిలు ఇవ్వడంలేదని హైకోర్టులో ఈ మూడేళ్లలో దాఖలైన 2లక్షల10వేలకు పైగా రిట్ పిటిషన్లపై దువ్వూరి ఏం సమాధానం చెబుతాడు?
-జీ.వీ.రెడ్డి 

రాష్ట్రప్రభుత్వ అప్పులు, ఆర్థికపరిస్థితిపై ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ పొంతనలేకుండా రెండునాల్కల ధోరణితో మాట్లాడాడని, టీడీపీప్రభుత్వం చేసిన అప్పుల్లో కార్పొరేషన్లు, బ్యాంకులరుణాలు, గ్యారంటీ-నాన్ గ్యారంటీ రుణాలు అన్నీకలిపిన జగన్ సర్కా ర్, తానుచేసిన అప్పుల్లోమాత్రం కేవలం ఆర్బీఐ అనుమతితో చేసిన అప్పుల్నే ఎలా చూపు తుందని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి జీ.వీ.రెడ్డి ప్రశ్నించారు.

జూమ్ ద్వారా బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన జగన్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వా ధికారులు రాష్ట్రఅప్పు రూ.10లక్షలకోట్లకు పైగా ఉందన్న పచ్చినిజాన్ని కప్పిపెట్టి, టీడీపీపై, చంద్రబాబుపై బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. విలేకరులతో జీ.వీ.రెడ్డి మాట్లాడి న వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!

“ముఖ్యమంత్రి ప్రత్యేకకార్యదర్శి దువ్వూరికృష్ణ నిన్న అప్పులపై ప్రతిపక్షాలను విమర్శిస్తూ, రెండునాల్కల ధోరణితో మాట్లాడాడు. ఏపీఅప్పులు గతప్రభుత్వలో ఎం తో…ఇప్పుడు ఎంతో ఆయనకు తెలియదా? తెలియకుండానే ఆర్థికవ్యవహారాలు, అప్పులపై మీడియాముందు కట్టుకథలు అల్లాడా? దేశమంతా అప్పులు పెరిగాయి… రాష్ట్రంలో అప్పులు చాలాతక్కువేనని ఆయన చెప్పడం నిజంగా సిగ్గుచేటు.

• టీడీపీప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుని, జగన్ ప్రభుత్వం మూడేళ్లలోచేసిన అప్పుతో ఎలా పోలుస్తుంది?
• జగన్ ప్రభుత్వం, గతంలో టీడీపీప్రభుత్వంచేసిన అప్పులపై ఎలాగైతే శ్వేతపత్రం విడుదలచేసిందో, అదేవిధంగా తాముచేసిన అప్పులపై ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయదు?
• రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం నుంచి ఎవరైనా, ఎప్పుడైనా బహిరంగచర్చకు రావొచ్చని టీడీపీ సవాల్ చేస్తుంటే ఎందుకు స్పందించరు?
• అప్పులకింద కేవలం ఆర్బీఐ రుణాలనే చెబితే ఎలా? ప్రభుత్వకార్పొరేషన్లు, బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలు, పెండింగ్ బిల్లులు, గ్యారంటీ, నాన్ గ్యారంటీ రుణాలన్నీ అప్పులకిందే వస్తాయి.
• 2019 జూలైలో ఏపీప్రభుత్వం విడుదలచేసిన శ్వేతపత్రంలో 2019మార్చినాటికి (టీడీపీప్రభుత్వం దిగిపోయేనాటికి) రాష్ట్రఅప్పులు రూ.3,62,375కోట్లని చెప్పింది.
• రూ.3,62,375కోట్ల అప్పులో 2014 మార్చికి ముందున్న అప్పుతాలూకా సొమ్ముకూడా ఉంది. దానితో పాటు, 2014 నుంచి 2019 మార్చివరకు టీడీపీప్రభుత్వం చేసిన అప్పుని కూడా కలిపారు.
• టీడీపీప్రభుత్వం ఆర్బీఐద్వారా తెచ్చినఅప్పులు, పవర్ సెక్టార్, సివిల్ సప్లైస్ విభాగానికి, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన సొమ్ముని కూడా వైసీపీప్రభుత్వం శ్వేతపత్రంలో చూపింది.
• టీడీపీప్రభుత్వం చేసిన అప్పుల్లో అన్నిరుణాలు కలిపిన వైసీపీప్రభుత్వం, ఇప్పుడు తాను చేసిన అప్పుల్లో మాత్రం కార్పొరేషన్ రుణాలతో తమకు సంబంధంలేదని ఎలా చెబుతుంది?
• వైసీపీప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బులు, పెండింగ్ బిల్లులు అప్పుల్లో కలపకూడదంటున్న ప్రభుత్వాధికారులు, టీడీపీప్రభుత్వానికి మాత్రం అవన్నీ ఎలా అంటగట్టారో సమాధానం చెప్పాలి.
• సాక్షిమీడియా కేవలం ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులే ప్రభుత్వ అప్పులుగా చూపుతూ, తప్పుడుప్రచారం చేస్తోంది.
• ఆర్బీఐద్వారా టీడీపీప్రభుత్వం 2014-19మధ్యన రూ.1,58,000కోట్లు అప్పులు తెస్తే, తమప్రభుత్వం మూడున్నరేళ్లలో కేవలం రూ.1,70,640కోట్లు మాత్రమే తెచ్చినట్టు చెప్పుకొస్తున్నారు.
• కానీ ఆర్బీఐ నివేదికలో మాత్రం వైసీపీప్రభుత్వం రూ.2,03,598కోట్లు అప్పులు తెచ్చినట్టు ఉంది.
• దువ్వూరికృష్ణ ఆర్బీఐ నివేదికను కూడా తొక్కిపెట్టి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు.
• కార్పొరేషన్లద్వారా రూ.94,928కోట్లు అప్పులు తెచ్చిన జగన్ ప్రభుత్వం, వాటితో తమకు సంబంధంలేదని ఎలా చెబుతుంది? సంబంధంలేకుంటే ప్రభుత్వఆస్తుల్ని తాకట్టుపెట్టి, ప్రభుత్వగ్యారంటీతో అప్పులు ఎలా తెచ్చారు?
• ఎఫ్.ఆర్.బీ.ఎం యాక్ట్ ప్రకారం ప్రభుత్వం తీసుకునేరుణాలన్నీ ప్రభుత్వరుణాలకిందకే వస్తాయని దువ్వూరికి తెలియదా?
• 2022-23 ఆర్థికసంవత్సరంలో మొదటి పదినెలల్లోనే ప్రభుత్వం రూ.81,900కోట్ల అప్పుచేసింది. ఎఫ్.ఆర్.బీ.ఎం. పరిధిదాటి రూ.32వేలకోట్ల అప్పుచేసింది.
• ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి రూ.10వేలకోట్లు, మారిటైమ్ బోర్డు నుంచి రూ.5వేలకోట్లు, ప్రభుత్వం వివిధ సంస్థలకు పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.27,384కోట్లు, కాంట్రాక్టర్లకు, ఇతరత్రా సప్లయర్స్ కుచెల్లించాల్సింది రూ.80వేలకోట్లు, సివిల్ సప్లయిస్ శాఖద్వారా రూ.31,500కోట్లు, లిక్కర్ బాండ్లు తాకట్టుపెట్టి రూ.8,305కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వ అప్పులుకావా? ఇవేవీ అప్పులలెక్కల్లో కలపకుండా కట్టుకథలుచెబుతారా?
• వైసీపీప్రభుత్వం తమకు బకాయిలుఉందని, మూడేళ్లనుంచి రూపాయిఇవ్వడంలేదని బాధితులంతా 2లక్షల10వేలకు పైగా రిట్ పిటిషన్లు హైకోర్టు లో ఫైల్ చేశారు.
• వాటిలో కొన్నింటిని విచారించిన న్యాయస్థానం బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తే, 11వేల పిటిషన్లకు సంబంధించి జగన్ సర్కార్ కోర్టు ఆదేశాలను ధిక్కరించింది. న్యాయస్థానం డబ్బులివ్వమన్నా ఇవ్వకుండా కాంట్రాక్టర్లను వేధిస్తోంది.
• ప్రభుత్వఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలు ఇంకా ఉన్నాయి. అవన్నీ దాదాపు రూ.27,150కోట్లకు పైగా ఉన్నాయి.
• ఎన్టీఆర్ ఆరోగ్యవిశ్వవిద్యాలయం, ఇతరసంస్థలనుంచి తీసుకున్న ఫిక్స్ డ్ డిపాజిట్ల సంగతేమిటి? వాటిని చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?
• కరోనాను బూచిగా చూపి, కేంద్రంనుంచి అదనంగా రూ.20వేలకోట్లు అప్పుతెచ్చిన జగన్ సర్కార్ వాటిని కూడా కాజేసింది. ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎక్కువ గ్రాంట్లు పొందారు.
• కరోనా వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం పావలా అయితే, కేంద్రం, ఇతరసంస్థల నుంచి రూ.2ల లబ్ధిపొందింది. అవన్నీ చాలక ప్రజలపై విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ, చమురుధరలుపెంచి, ఇతరత్రా పన్నులతో మోయలేని భారం మోపారు.
• ప్రభుత్వానికి ఆర్థికఇబ్బందులు లేకుంటే సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడంలేదు? డీఏలు, టీఏలు, పింఛన్లు ఎందుకు ఇవ్వడంలేదు? సీ.పీ.ఎస్ ఎందుకు రద్దుచేయడంలేదు?
• పొద్దునలేస్తే అప్పులకోసం బ్యాంకుల్ని, కేంద్రాన్ని, ఆర్థికసంస్థల్ని దేబిరిస్తూ, రాష్ట్రంలో అప్పులేలేవని, అప్పులన్నీ గతప్రభుత్వం చేసినవేనని కట్టుకథలు చెబుతారా?
• రాష్ట్ర అప్పులు రూ.10లక్షలకోట్లకు పైమాటే. తాముచెప్పే అంశాలు, అంకెలపై ప్రభుత్వానికి చిత్తశుధ్ధి ఉంటే తక్షణమే అప్పులపై వాస్తవాలతో బహిరంగచర్చకు రావాలి” అని మీడియాసాక్షిగా జీ.వీ.రెడ్డి ముఖ్యమంత్రి, మంత్రులకు సవాల్ విసిరారు.

LEAVE A RESPONSE