-టీడీపీ-జనసేన కలయికతో తనకు తన పార్టీకి ఓటమి తప్పదనే ఎన్నికలకు మూడునెలల ముందే జగన్ రెడ్డి చేతులెత్తేశాడు
• ఒకచోట చెల్లని కాసులు, మరోచోట ఎలా చలామణీ అవుతాయో జగన్ రెడ్డే చెప్పాలి
• ఓటమి భయంతోనే రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏపార్టీ చేయని విధంగా జగన్ రెడ్డి రాజకీయ బదిలీలకు తెరతీశాడు.
• వైసీపీలో ఇప్పుడు 11 వికెట్లే పడ్డాయి. 2024 జనవరి నాటికి ఆ పార్టీ దివాళా బోర్డు పెట్టడం ఖాయం
• జగన్ రెడ్డి విచ్చలవిడి అవినీతి, దోపిడీనే తమకు శాపంగా మారాయని వైసీపీ ఎమ్మెల్యేలు బావురుమంటున్నారు
• జగన్ రెడ్డి చేయించిన అన్నిసర్వేలు తనపార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదని తేల్చాయి
• పాదయాత్రలో, ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి 1700 హామీలు ఇచ్చాడు
• జగన్ రెడ్డిని నమ్మిన పాపానికి ప్రజలు రోడ్డున పడితే, ఉపాధ్యాయులు విషం తాగుతున్నారు. అంగన్ వాడీ సిబ్బంది జీతాలకోసం ఆర్తనాదాలు చేస్తున్నారు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
తనకు, తన పార్టీకి ఓటమి ఖాయమని గ్రహించే జగన్ రెడ్డి మూడునెలల ముందే పూర్తిగా చేతులెత్తేశాడని, ఎన్నికల కోసం కొత్త జిమ్మిక్కులకు పాల్పడుతూ, రాజ కీయ నాయకుల బదిలీలకు తెరలేపాడని, నాలుగున్నరేళ్లుగా ఒక నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నవారు, అక్కడే పనికి రాకపోతే మరో నియోజకవర్గంలో ఎలా పనికొస్తారో, ఎలా గెలుస్తారో జగన్ రెడ్డే చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో సగం మంది ఈసారి ఆ పార్టీ నుంచి పోటీకి విముఖత చూపుతున్నారు
“ జగన్ రెడ్డి ముగ్గురు మంత్రుల్రి, ఒక మాజీ మంత్రిని ఇతర నియోజకవర్గాలకు పంపించాడు. ఒక నియోజకవర్గంలో చెల్లని కాసులుగా ఉన్నవారు.. మరోచోట ఎలా చెల్లుతారో, ప్రజల్లో ఎలా చలామణీ అవుతారో ముఖ్యమంత్రే చెప్పాలి. చిలకలూరిపేట ప్రజలకు నచ్చనివారు గుంటూరు పశ్చిమంలో ఎలా నెగ్గుకొస్తారు? పెడన నియోజకవర్గంలో జనం ఛీకొట్టిన వ్యక్తి, మరో నియోజకవర్గంలో ఎలా పనికొస్తాడు? వీటన్నింటికీ జగన్ సమాధానం చెప్పాలి. సాక్షాత్తూ మంగళగిరి వైసీపీఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి మీరువద్దు, మీ పార్టీ వద్దు అని జగన్ రెడ్డికి మొరపెట్టుకొని వైసీపీకి రాజీనామా చేశాడంటే మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటో, మున్ముందు ఎలా ఉంటుందో వారే ఆలోచించుకోవాలి.
నాలుగున్నరేళ్లుగా రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉంటూ, చేయకూడని దారుణాలన్నీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చివరకు ఓటమి భయంతోనే రాజీనామా చేసి నియోజకవర్గం వదిలి జంప్ అయ్యాడు. అలానే గాజువాక వైసీపీ ఇన్ ఛార్జ్ జంప్. అలానే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలు వదిలేసి పక్కరాష్ట్రాల్లో బతుకుతున్నారు. వారంతా తమ నియోజకవర్గాల్లో అడుగుపెట్టి ఇప్పటికే నెలలు గడిచాయి. వైసీపీలోని 151 మంది ఎమ్మెల్యేల్లో సగంమందికి పైగా సభ్యులు అధికారపార్టీ నుంచి పోటీ చేయడానికి విముఖత చూపుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలి.
చంద్రబాబు కనుసైగ చేస్తే వైసీపీలో సగం మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు
ఇతరపార్టీలు తలుపులు తెరిస్తే వైసీపీకి చెందిన 75 మంది ఎమ్మెల్యేలు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు టిక్కెట్లు ఇవ్వక పోయినా పరవాలేదు.. తమను టీడీపీలో చేర్చుకోండని చంద్రబాబును బతిమా లుతున్నారు. ఉత్తరాంధ్రలోని ఒక మంత్రి కుటుంబం కూడా టీడీపీతో టచ్ లో ఉంది. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వైసీపీ దుకాణం పూర్తిగా మూతపడటం ఖాయం. టీడీపీతోపాటు జనసేనతో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారు. జగన్ రెడ్డిని నమ్మినందుకే వైసీపీ ఎమ్మెల్యేలకు నేడు ఇతరపార్టీల అధ్యక్షుల కాళ్లుపట్టుకునే పరిస్థితి వచ్చింది.
అధికారపార్టీ ఎమ్మెల్యేల్లో చాలామంది తమకు ఈసారి పోటీచేసే ఆలోచనలేదని, టిక్కెట్లు కేటాయించవద్దని వైసీపీ రీజనల్ ఇన్ ఛార్జ్ లకు బహిరంగంగానే చెబుతున్నారు. నిన్నటివరకు జగన్ రెడ్డి వైనాట్ 175 అని బీరాలు పలికాడు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న రాజకీయ బదిలీలతో తనపార్టీ పని అయిపో యిందని తానే ఒప్పుకుంటున్నాడు. వైసీపీ పని, జగన్ రెడ్డి పని అయిపోయాయి. ఎన్నికలకు మూడు నెలల ముందే చేతులెత్తేసిన రాజ కీయపార్టీగా వైసీపీ రాష్ట్రచరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది.
జగన్ రెడ్డి చేయించిన అన్ని సర్వేలు వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదని తేల్చాయి
జగన్ రెడ్డి చేయించిన అన్ని సర్వేలు వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రావని తేల్చేశాయి. ఐప్యాక్ సంస్థతో పాటు ఇంటిలిజెన్స్ విభాగం, ఇతర రాష్ట్రాలనుంచి పిలిపించిన షెఫ్రాలజిస్ట్ లతో జగన్ చేయించిన సర్వేలన్నీ వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం కానుందని తేల్చాయి. టీడీపీ-జనసేన కలయికతో వైసీపీ పునాదులు కదిలే పరిస్థితి తలెత్తింది. జగన్ రెడ్డిని నమ్మిన వారికి చివరకు నమ్మకద్రోహమే మిగిలింది. తన అవసరం కోసం ఎవరి గొంతు కోయడానికైనా జగన్ రెడ్డి వెనుకా డడని ఇప్పటికే సీట్లు కోల్పోయిన వైసీపీఎమ్మెల్యేలు, ఇతరనేతలకు అర్థమైంది. కొందరైతే జగన్ రెడ్డి చర్యలతో విసుగుచెంది ఏకంగా పార్టీకే రాజీనామా చేస్తున్నా రు. ఏడాది క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు 108 నియోజకవర్గాల్లో టీడీపీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు.
నాడు చదువుకున్న వారు మాత్రమే వైసీపీని తిరస్కరించారనుకుంటే, ఇప్పుడు అన్నివర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారు. ఇసుక, మద్యం, గనులు, భూములు, ఇళ్లపట్టాలు, ఇలా అన్నింటిలో విచ్చలవిడి అవినీతికి పాల్పడిన జగన్ రెడ్డి దోపిడీతో వైసీపీ ఎమ్మె ల్యేలు ప్రజలకు ముఖంచూపించలేని దుస్థితికి వచ్చారు. రాష్ట్రం అథోగతి పాలు కావడానికి కారణం జగన్ రెడ్డి అవినీతేనని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు.
జగన్ రెడ్డి నివాసముండే నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పు కోవడమే అందుకు నిదర్శనం. నిన్న వైసీపీలో 11 మంది తమకు తామే సెల్ఫ్ అవుట్ చేసుకున్నారు. త్వరలోనే ఆ జాబితా ఇంకా పెరుగుతుంది. 2024 జనవరి నాటికి వైసీపీ దివాళా బోర్డు పెట్టుకోవడం ఖాయం. పట్టుబట్టి డబ్బులిచ్చి పోటీ చేయించినా ఎవరు ఆ పార్టీ నుంచి 2024ఎన్నికల్లో పోటీ చేయరని తేలిపోయింది.
175 నియోజకవర్గాల్లో పోటీచేసే వైసీపీ అభ్యర్థుల్ని ప్రకటించే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా?
జగన్ రెడ్డిని నమ్మిన పాపానికి ప్రజలు రోడ్డునపడితే, ఉపాధ్యాయులు, ఉద్యోగులు విషం తాగుతున్నారు. అంగన్ వాడీ సిబ్బంది జీతాల కోసం ఆర్త నాదాలు చేస్తున్నారు. పాదయాత్ర సమయంలో ఎన్నికల వేళ జగన్ రెడ్డి 1700 హామీలు ఇచ్చాడు. వాటిలో ఒక్కదాన్ని నెరవేర్చకుండా నాలుగున్నరేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుతిన్నాడు. జగన్ రెడ్డి చెప్పిందల్లా చేసి, ఆఖరికి ప్రజల రాజధాని అమరావతిని కూడా నాశనంచేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు వైసీపీకి రాజీనామా చేశాడు?
ఒకచోట చెల్లని కాసుల్ని మరోచోట ప్రజలు ఆదరిస్తారని జగన్ భావిస్తున్నాడు. రాష్ట్రమంతా తనకు, తనపార్టీకి ప్రజలు శాశ్వతంగా సమా ధి కట్టబోతున్నారని జగన్ రెడ్డి తెలుసుకునే సరికి వైసీపీకథ ముగుస్తుంది. ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం… వద్దనడం టీడీపీ అధినేత నిర్ణయం. 175 నియోజకవర్గాల్లో వైసీపీ తరుపున పోటీచేసే అభ్యర్థులు వీళ్లు అని జగన్ రెడ్డి ధైర్యంగా ప్రకటించగలరా? 90 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నా తాడేపల్లిలో కూర్చొని ఇంకా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తే ప్రజలు నమ్ముతారా? 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన అద్భుత విజయం సాధించబోతు న్నాయి. ఆ కాంబినేషన్ కు భయపడే జగన్ రెడ్డి మూడునెలల ముందే చేతు లెత్తేశాడు.” అని బొండా ఉమా ఎద్దేవాచేశారు.