- గోరంట్ల మాధవ్ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‍కు పంపకుండానే ఒరిజినల్ వీడియో కాదని ఎస్పీ ఎలా చెప్తారు
- గోరంట్ల మాధవ్ వ్యవహారం వివేకా మర్డర్ కేసులా సాగదీస్తే ప్రయత్నాలు చేస్తున్నారు
- తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి
గోరంట్ల మాధవ్‍కు సంబంధించిన వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‍కు పంపకుండానే అనంతపురం ఎస్పీ పక్కీరప్ప మార్ఫింగ్ చేసిన వీడియో అని ఏ రకంగా చెబుతారు. ఒక ఎస్పీ అయ్యిఉండి ఇలాంటి ప్రకటన చేయడం మంచిది కాదు. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అన్నదానికంటే.. ఈ వీడియో ఒరిజినలా? కాదా? అనే దృష్టి సారిస్తే మంచిది. గత ఐదు రోజులుగా కొండలు తవ్వి ఎలుకను పట్టినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. హోంమంత్రి ప్రకటనకు, ఎస్పీ ప్రకటనలకు పొంతన లేదు. గోరంట్ల మాధవ్ వ్యవహారం కూడా వివేకా మర్డర్ కేసులా సాగిస్తూపోతారా. ఒక ఎంపీ ఇలాంటి ఎదవ పని చేస్తే ఏ ఆధారాలు లేకుండా మార్ఫింగ్ అని చెప్పడం ఎస్పీలా వ్యవహరించకుండా.. వైసీపీ ప్రభుత్వ సర్వెంట్లా వ్యవహరిస్తున్నంట్లుంది.