Suryaa.co.in

Andhra Pradesh

దేశంలోనే అత్యంత ధనవంతుడైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యారు?

– 2004 కు ముందు హైదరాబాద్ లో ఉండటానికి సరైన ఇల్లులేని జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు తనసంపాదన వెనకున్న కిటుకేమిటో ముఖ్యమంత్రి ప్రజలకుచెప్పి, అప్పులఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డుకు తేవాలి.
• 2004కు ముందు ఏమీలేని జగన్మోహన్ రెడ్డి, 2010లో రూ.85కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేస్థాయికి చేరినప్పుడే, తనతండ్రి అధికారంతో ఆయన లైఫ్ స్టైల్ ఎంతగా మారిందో రాష్ట్రప్రజలకు అర్థమైంది.
• జగన్మోహన్ రెడ్డికంటే ముందు రాజకీయాల్లో ఉన్న తలపండిన నేతలకు లేని ఆస్తులు అతిస్వల్పకాలంలో ఆయనకు ఎలా వచ్చాయన్నదే రాష్ట్రప్రజల సందేహం.
• కందుకూరు దుర్ఘటనపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, ఆయనలోని భయానికి సంకేతం.
• జగన్ పాదయాత్రలో 8మంది చనిపోయి, 45మంది క్షతగాత్రులైనా, మేమెప్పుడూ దాన్ని రాజకీయంచేయలేదు.
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య

2004లో తనతండ్రి, దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు, జగన్మోహన్ రెడ్డి పెద్దరాజకీయవేత్తకాదు, బడాపారిశ్రామికవేత్తకాదని, అలాంటివ్యక్తి 2010 లో రూ.85కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేస్థాయికి ఎదిగాడని, మరీఅనూహ్యంగా ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఆయన నిలవడం, రాష్ట్రప్రజల్ని నివ్వెరపరిచిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుల వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …!

“తనతండ్రి ముఖ్యమంత్రి అయ్యేనాటికి జగన్మోహన్ రెడ్డి పెద్దరాజకీయవేత్తేమీ కాదు. బడా పారిశ్రామికవేత్తకూడా కాదు. ఏదో అల్లరిచిల్లరిగా వ్యవహరిస్తూ, ఆకతాయితనంతో బెంగుళూ రులో ఉండేవాడు. 2004లో దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే జగన్మోహన్ రెడ్డి లైఫ్ స్టైల్ మారిపోయింది. 2004 ఎన్నికల అఫిడవిట్లో రాజశేఖర్ రెడ్డి తనకు, తనకుటుంబానికి ఉన్న ఆస్తుల విలువ కేవలం రూ.2కోట్ల12లక్షలని చెప్పారు. తరువాత జగన్మోహన్ రెడ్డి 2009ఎన్నికల అఫిడవిట్లో తనకుటుంబఆస్తి రూ.77కోట్ల40లక్షలు ఉన్న ట్టు చూపారు. అదే జగన్మోహన్ రెడ్డి 2010లో పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలతో పోటీపడి రూ. 85కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడం, ఆనాటి ఉమ్మడిరాష్ట్ర ప్రజానీకాన్నినివ్వెరపరిచింది.

తనతండ్రి అధికారంతో జగన్మోహన్ రెడ్డి లైఫ్ స్టైల్ ఎంతగా మారిపోయిందో ఆఘటనతో నాటి ప్రజలకు అర్థమైంది. తరువాత జగన్మోహన్ రెడ్డి 2011లో కడప ఉపఎన్నికలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనఆస్తి రూ.445కోట్లని, 2014 ఎన్నికల అఫిడవిట్లో రూ.416కోట్లు, 2019ఎన్నికల అఫిడవిట్లో రూ.405కోట్లు ఉన్నట్లు చూపారు. వాటికి అదనంగా 64గదులతో లోటస్ పాండ్ పేరుతో హైదరాబాద్ లో ఉన్న పెద్ద బంగ్లా, బెంగుళూరులోని ఎలహంకలో 30ఎకరాల్లో, అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు నివసించే శ్వేతసౌధాన్ని తలపించేలా నిర్మించిన మరోభారీ ప్యాలెస్ ను చూపారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి సాక్షిటీవీ, సాక్షి దినపత్రిక ప్రారంభించారు.

సాక్షి దినపత్రిక ప్రీమియం విలువ రూ.10 అయితే, దాన్ని రూ.380కి కొన్నట్టు చూపారు. డెలాయిట్ ఆడిటింగ్ సంస్థ, రూ.380కోట్ల విలువైన జగతి పబ్లికేషన్స్ విలువను రూ.3,500కోట్లుగా చూపింది. సదరుసంస్థ ఏ2 విజయసాయిరెడ్డిదే. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో అప్పనంగా భూములుకొట్టేసిన వారు, జగన్ కు చెందిన సాక్షి మీడియాలో పెట్టుబడిపెట్టారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 28వేలఎకరాలు కొట్టేసిన వాన్ పిక్ వారు, సాక్షిలో రూ.800కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆ క్రమంలోనే వై.ఎస్. ప్రభుత్వం బ్రాహ్మణి స్టీల్స్ కు 18వేల ఎకరాలు కట్టబెట్టింది. ఈ బాగోతానికి సంబంధించే క్విడ్ ప్రోకోద్వారా జగన్మోహన్ రెడ్డి రూ.43వేలుకొట్టేశారని అత్యున్నత దర్యాప్తుసంస్థ సీబీఐ ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది.

2004కు ముందు హైదరాబాద్ నగరంలో సరైన ఇల్లుకూడా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎలా అయ్యారు?
ఆ వ్యవహారం అలాఉంటే, ఈనాడు దేశంలోని అందరి ముఖ్యమంత్రులకంటే జగన్మోహన్ రెడ్డే అత్యంత ధనవంతుడైన సీఎంగా నిలిచారు. 373.80కోట్ల ఆస్తితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రే అత్యంత ధనవంతుడైన సీఎం. 2004లో హైదరాబాద్ నగరంలో ఉండటానికి సరైన ఇల్లుకూడా లేని జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అత్యంతధనవంతుడైన సీఎం ఎలా అయ్యారు? చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెం-2లో ఉన్న 1000 గజాల ప్రభుత్వస్థలం తనకు ఇవ్వాలని, దాన్నిఅమ్ముకొని తనకున్న అప్పులు తీర్చుకుంటానని ఆనాడు రాజశేఖర్ రెడ్డి అర్జీ పెట్టుకుంది నిజంకాదా?

ఆనాడు అలాంటి స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఈనాడు దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయనేతగా ఎలా ఎదిగారో, ఆ కిటుకు ఏమిటో రాష్ట్రప్రజలకు చెప్పాలని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి అంతస్థాయికి ఎలాఎదిగారో, ఆయన వ్యాపారదక్షత, సంపాదన వెనకున్నకిటుకు ఏమిటో చెప్పాలి. ఆ కిటుకుచెప్పి, అప్పులఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఒడ్డుకు తేవాలని కూడా కోరుతున్నాం.

తలపండిన రాజకీయనేతలకే సాధ్యంకాని ధనార్జన జగన్మోహన్ రెడ్డికి ఎలా సాధ్యమైంది?
జగన్మోహన్ రెడ్డి కంటే ముందు నుంచీ రాజకీయాల్లో ఉన్న తలపండిన నేతలెవరికీ సాధ్యంకాని ఘనత మనముఖ్యమంత్రికే ఎలా సాధ్యమైంది? దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎలా నిలిచారు అన్నదే ఇప్పుడు రాష్ట్రప్రజల మెదళ్లను తొలుస్తున్న సందేహం. పదేళ్లనుంచి బీహార్ సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ ఆస్తి కేవలం రూ.56లక్షలు, చత్తీస్ ఘడ్ సీఎం ఆస్తి రూ.15కోట్లు, గుజరాత్ సీఎం ఆస్తి రూ.4కోట్లు, హిమాచల్ ప్రదేశ్ సీఎం ఆస్తి రూ.5కోట్లు, గోవాముఖ్యమంత్రి ఆస్తి రూ.5కోట్లు, ఉత్తరప్రదేశ్ సీఎం ఆస్తి రూ.1కోటి50లక్షలు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆస్తి రూ. 2కోట్లు మాత్రమే. ఒడిశా సీఎం ఆస్తి రూ.63కోట్లు (పూర్వీకులఆస్తులతోకలిపి), తమిళనాడు సీఎం స్టాలిన్ ఆస్తి రూ.7కోట్లు, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఆస్తి రూ.13కోట్లు, కర్ణాటక సీఎం ఆస్తి రూ.1కోటి, కేరళ ముఖ్యమంత్రి ఆస్తి రూ.70లక్షలే, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆస్తి కేవలం రూ.15లక్షలు మాత్రమే.

ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులగా ఉన్నవారంతా జగన్మోహన్ రెడ్డికంటే ముందే రాజకీయాల్లో ఉన్నారు. కొందరు ఎప్పటినుంచో ముఖ్యమం త్రులుగా ఉన్నారు. వారెవరూ సాధించలేని రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా ఘనత జగన్మోహన్ రెడ్డే ఎలా సాధించాడో తనప్రజలకు చెప్పాలని విజ్ఞప్తిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ధనార్జనలో అందరికంటే ముందున్నప్పుడు, అప్పులఊబిలో ఉన్న రాష్ట్రాన్నికూడా పైకి తేవ డం ఆయనకు పెద్ద కష్టమేంకాదు.

ప్రతిపక్ష నేత సభలకు ప్రభుత్వం తగిన భద్రతకల్పించడం లేదన్న వాస్తవం ప్రజలకు తెలియకూడదనే, ముఖ్యమంత్రి కందుకూరు దుర్ఘటనని రాజకీయంచేసి, చంద్రబాబుపై బురద జల్లుతున్నాడు.

దేశంలోనే అత్యంతధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, కందుకూరు ఘటనలో మరణించిన టీడీపీకార్యకర్తలను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడటం ఆయనలోని భయానికి సంకేతం. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ప్రజలు చనిపోయారంటున్న జగన్మోహ న్ రెడ్డికి, అంతకుముందు ప్రతిపక్షనేత సభలకు పోటెత్తిన జనంకనిపించలేదా అని ప్రశ్నిస్తు న్నాం. ఉత్తరాంధ్రలో చంద్రబాబుసభలకు జనం విరగదొక్కుకున్న సంగతి ముఖ్యమంత్రి మర్చిపోయారా? కర్నూల్లో ప్రతిపక్షనేత సభలకు ప్రజలు పోటెత్తిన విషయం జగన్ కు గుర్తులేదా? చంద్రబాబు సభలకు పోలీసులు తగినవిధంగా ఏర్పాట్లు చేయడంలేదని తెలిస్తే తాను తలదించుకోవాల్సి వస్తుందనే జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడారు.

జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలు చనిపోతే, చంద్రబాబుగారు బాధ్యతగల ముఖ్యమంత్రిగా వారిని ఆదుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 45మంది క్షతగాత్రులయ్యారు. వారికి ఏనాడు ఆయనేమీ సాయం చేయలేదు. అలానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వివిధ సందర్భాల్లో 173 మంది అమాయకులు చనిపోయారు. దానిపై తాము ఎన్నడూ రాజకీయాలు చేయలేదు. ముఖ్యమంత్రికి ఒక భయంపట్టుకుంది. ప్రజలు ఆయన్ని, ఆయనపార్టీని చీదరించుకుంటున్నారు.

అదితెలిసే జగన్మోహన్ రెడ్డి భయాందోళనకు గురై, అర్థంపర్థంలేకుండా మాట్లాడుతున్నారు. దుర్ఘటనను దుర్ఘటనలా చూడకుండా ముఖ్యమంత్రిస్థానంలో ఉన్నవ్యక్తి ప్రతిపక్షనేతపై బురదజల్లడంకోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఎలా? జగన్మోహన్ రెడ్డి సలహాదారులుకూడా చెత్త సలహా దారులు. అలా మాట్లాడటం మంచిదికాదని ముఖ్యమంత్రికి చెప్పాల్సిన బాధ్యత వారిపై లేదా అని” రామయ్య దెప్పిపొడిచారు.

LEAVE A RESPONSE