Suryaa.co.in

Telangana

కేసీఆర్ కు వేల కోట్లు ఎలా వచ్చాయి?

– టెర్రరిస్టు, ఇతర సంస్థలేమైనా సాయం చేస్తున్నాయా?
– దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటికీ డబ్బులు ఖర్చు పెట్టే స్థాయి ఎలా సాధ్యమైంది?
– కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరపాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాడ్
– కేసీఆర్ దుష్ట పన్నాగాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు
– 8న జరిగే బహిరంగ సభను భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

‘‘8 ఏళ్ల క్రితం నందినగర్ లో ఇల్లు మాత్రమే ఉన్న కేసీఆర్ కు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి? ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలకయ్యే ఎన్నికల వేల కోట్ల నిధులిచ్చే స్థాయికి ఎట్లా చేరారు? ఇతర దేశాల నుండి నిధులొస్తున్నాయా? దేశం విచ్ఛిన్నం చేసేందుకు టెర్రరిస్టు సంస్థలేమైనా సాయం చేస్తున్నాయా? తక్షణమే సంబంధిత ఏజెన్సీ సంస్థలన్నీ సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నా’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బూత్ స్వశక్తీరణ అభియాన్, ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన, సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, కోశాధికారి శాంతికుమార్, హైదరాబాద్ సెంట్రల్, రంగారెడ్డి అర్బల్, రూరల్, మేడ్చల్ అర్బన్, రూరల్, సికింద్రాబాద్- మహంకాళి, మలక్ పేట భాగ్యనగర్ జిల్లాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొంన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
దేశవ్యాప్తంగా బీజేపీ బూత్ స్వశక్తీ అభియాణ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణలో పోలింగ్ బూత్ కమిటీల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి. దీంతోపాటు ఈనెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సం. ఆరోజు విస్త్రతంగా కార్యక్రమాలు చేపట్టాలి. దీంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8న హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ అభివ్రుద్ధి కోసం కేంద్రం ఎన్ని నిధులిస్తోంది? ఏయే కార్యక్రమాలు చేపడుతుందనే అంశంపై మోదీ వివరణ ఇవ్వబోతున్నారు. కేంద్రం అభివ్రుద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నా… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదనే అంశాన్ని వివరించబోతున్నారు. ఆరోజు జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి విజయవంతం చేయాలి. రాజ్ దీప్ సర్దేశాయ్ బీజేపీ కాదు.. ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నింటికీ డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్దమయ్యారు. ఆయనను కూటమికి ఛైర్మన్ ను చేస్తే.. ప్రతిపక్ష కూటమికి ఛైర్మన్ గా చేస్తే దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటికీ ఎన్నికల కోసం ఖర్చయ్యే వేల కోట్ల నిధులిచ్చేందుకు సిద్దంగా ఉన్నానని కేసీఆర్ చెప్పారు. ఇది నామాట కాదు.. దేశంలోని ఓ ప్రఖ్యాత జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పారు. ఆయన బీజేపీ మనిషి కాదు. బీజేపీ బద్ద వ్యతిరేకి. ఆయనే ఈ మాట చెప్పారంటే పరిస్థితి ఎట్లుందో అర్ధం చేసుకోండి.

8 ఏళ్ల క్రితం నందినగర్ లో ఇల్లు మాత్రమే ఉన్న కేసీఆర్ కు అసలు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి? ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే. ఇన్ని వేల కోట్లు ఖర్చు ఎలా సంపాదించారు? ప్రతిపక్ష పార్టీలకు ఖర్చు చేసే స్థాయికి ఎట్లా చేరారు ? కేసీఆర్ కు ఏ దేశం నుండి డబ్బులొచ్చాయి? టెర్రరిస్టు సంస్థలేమైనా నిధులిస్తున్నాయా? ఎందుకంటే చైనా, పాకిస్తాన్ మీద ప్రేమ ఎక్కువ. వెంటనే కేసీఆర్ వేల కోట్ల ఆస్తులపై సంబంధిత ఏజెన్సీలు విచారణ జరపాలని కోరుతున్నా. బీజేపీ కార్యకర్తలారా…. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, బీజేపీని దెబ్బతీసేందుకు కేసీఆర్ దుష్ట, దుర్మార్గపు పన్నాగాలు చేస్తున్నారు. మనమంతా ఆ దుర్మార్గాలను ఎదుర్కొంటూ మోదీ నాయకత్వంలో శక్తివంతమైన దేశాన్ని రూపొందించాలంటే పార్టీ కార్యకర్తలు క్రుషి చేయాలి. అందులో భాగంగా బూత్ స్వశక్తీ అభియాన్ ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలి. అట్లాగే ఈనెల 6న జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలతోపాటు 11న జ్యోతిరావు పూలె జయంతి, 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాలి.

LEAVE A RESPONSE