Suryaa.co.in

Andhra Pradesh

సీఎం సంతకం లేకుండా ప్రభుత్వ సొమ్ము ఎలా బయటకు వెళ్లింది?

-ఆయన సంతకంతోనే ప్రభుత్వ సొమ్ము బయటకు పోయింది
-ఈడీ క్లీన్‌చిట్‌ ఇచ్చిందని ఎలా చెప్పుకుంటారు?
-స్కిల్‌స్కామ్‌ దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకుంది
-అందుకే మరోసారి ఆస్తుల అటాచ్‌మెంట్‌
-వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి

తాడేపల్లి: స్కిల్‌స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తుతో చంద్రబాబు మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంటే.. తనకు ఈడీ క్లీన్‌చిట్‌ ఇచ్చి పూలదండలు వేసినట్లు ఆయన ప్రచారం చేసుకుంటున్నారని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఆక్షేపించారు. స్కిల్‌ స్కామ్‌లో ఈడీ దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకుందన్న ఆయన, అందుకు ఆస్తుల అటాచ్‌మెంట్‌ను ఉదహరించారు. ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా ఈడీ గుర్తించిందని తెలిపారు.

అసలు ఈ వ్యవహారంలో నిందితులకు ఆ ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించిన సతీష్‌రెడ్డి.. ఆ ఆస్తులకు డబ్బులు ఇచ్చింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు 13 చోట్ల స్వయంగా సంతకం పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం నిజం కాదా? అని నిలదీశారు. చంద్రబాబు సంతకం లేకుండా ప్రభుత్వ సొమ్ము ఎలా బయటకు వెళ్లింది?. మరి ఆయన సంతకంతో ప్రభుత్వ సొమ్ము బయటకు పోయినప్పుడు, చంద్రబాబు నేరస్తుడు కాకుండా పోతాడా?. అలా బయటకు వెళ్లిన సొమ్మును దారి మళ్లించిన మాట వాస్తవం కాదా? కేసును ఈడీ దర్యాప్తు చేస్తుంటే.. క్లీన్‌చిట్‌ ఇచ్చిందని ఎలా చెప్పుకుంటారు?. అని సతీష్‌రెడ్డి నిలదీశారు.

సీమెన్స్‌ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడిని షెల్‌ కంపెనీల ద్వారా బోగస్‌ ఇన్‌వాయిస్‌లు సృష్టించి.. ‘డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ (డీటీఎస్‌పీఎల్‌) ఎండీ వికాస్‌ వినాయక్‌ ఖండేల్కర్, సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్, అతని అనుచరులు ముకుల్‌ చంద్ర అగర్వాల్, సురేష్‌ గోయల్‌ దారి మళ్లించారని ఈడీ తన నోట్‌లో పేర్కొన్న విషయాన్ని సతీష్‌రెడ్డి గుర్తు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మరోసారి ఆస్తులు అటాచ్‌ చేశారని తెలిపారు.

LEAVE A RESPONSE