Suryaa.co.in

Andhra Pradesh

నిన్నటివరకు ఐటీ నోటీసుల్లో ఉన్నవారి పేర్లు నేడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులోకి ఎలా వచ్చాయి?

– సీఐడీ చీఫ్ మాటల్లో జగన్ ప్రభుత్వం ఎవరెవరిపై కక్షతో ఉందో అర్థమైంది
• ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ విచారణలో లోకేశ్ ను, వేరేవాటిలో మరికొందర్ని తప్పుడు ఆధారాలతో ఇరికించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు సీఐడీ బాస్ చెప్పకనే చెప్పారు
• స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు కేటాయించిన నిధులు రూ.370కోట్లు దారిమళ్లాయని సజ్జల అంటే, సంజయ్ రూ.500కోట్లు అంటున్నాడు
• జీఎస్టీ చెల్లింపుల కేసుకి, ప్రాజెక్ట్ తాలూకా ఒప్పందంలో సంతకాలు పెట్టిన సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని తెలిసినా..పదేపదే అదే జపం చేస్తున్నారు.
• సీఐడీ చీఫ్ సంజయ్ వద్ద నిజంగా ఆధారాలుంటే, చంద్రబాబు..లోకేశ్ ల అకౌంట్లకి ఏ ఖాతాలనుంచి ఎంత డబ్బులు వచ్చాయనే సమాచారం ఎందుకు బయట పెట్టలేదు
• ఈ ప్రభుత్వంలో చట్టం..న్యాయం.. ధర్మం ఏమీ లేవు. వైసీపీ ప్రభుత్వ… జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలకు తగినట్టే, ఇకనుంచి తమపార్టీ వ్యవహరిస్తుంది
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్

సీఐడీ చీఫ్ సంజయ్ తీరు, వ్యాఖ్యలు గమనిస్తే తప్పుచేశామనే భావన ఆయన ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించిందని, స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూ.370 కోట్లు దారిమళ్లాయని వసూల్ రాజా సజ్జల అంటే, సంజయ్ రూ.550కోట్లు అనడం.. రూ.40కోట్ల జీఎస్టీ అనడం.. మొత్తం ప్రాజెక్ట్ కి రూ.130కోట్లు ఖర్చయిందని చెప్పడం జగన్ రెడ్డి అహంకారపూరిత దురుద్దేశాలకు నిదర్శనమని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన మూడోసారి విలేకరు లతో మాట్లాడిన వివరాలు …

“ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో లేని అవినీతిని ఉన్నట్టు చూపడం కోసం జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం, అధికార యంత్రాంగం పిల్లిమొగ్గలు వేస్తోంది. 2013లో గుజరాత్ లో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది మొదలు, తరువాత ఆ ప్రాజెక్ట్ కోసం ఒప్పందం చేసుకున్న అన్నిరాష్ట్రప్రభుత్వాలు నిరుద్యోగ యువత శిక్షణకు అవసరమైన సాఫ్ట్ వేర్ పరిజ్ఞానం, హార్డ్ వేర్ పరికరాలు, ఇతరత్రా సాంకేతిక పరిజ్ఞానానికి అవసర మైన ఖర్చులో 90శాతం సీమెన్స్ సంస్థ పెడితే, 10శాతం ఆయా ప్రభుత్వాలు భరించాయి.

గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్, తెలంగాణ సహా అన్ని ప్రభుత్వాలు ఇదే పద్ధతి అనుసరించాయి. అలానే ఆయాప్రభుత్వాలు చేసుకున్న ఒప్పంద పత్రాల్లో ఇన్ కైండ్ అనే ఆప్షన్ స్పష్టంగా ఉంటుంది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, సీమెన్స్ ఇండియా ఇండస్ట్రియల్ లిమిటెడ్, డిజైన్ టెక్ సం స్థలు మాత్రమే త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి.

అన్ని ప్రభుత్వాల ఒప్పందాలు ఇదే విధంగా ఉంటాయి. ఒప్పందాలతో పాటు, వాటిలో స్పష్టంగా ఏముందనేది కళ్ల ముందు కనిపిస్తున్నా సీఐడీ విభాగం కేవలం ముఖ్యమంత్రి మెప్పుకోసమే పనిచేసింది తప్ప, పారదర్శక దర్యాప్తు జరపలేదు.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై 22 నెలలుగా విచారిస్తున్న ఏపీప్రభుత్వం ఏనాడూ చంద్రబాబు పేరు చెప్పకుండా, ఈడీ విచారణలో కూడా ఆయన లేనప్పుడు జగన్ రెడ్డి సర్కారు ఇప్పుడు ఆయన్ని ఎలా అరెస్ట్ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 30శిక్షణా కేంద్రాలు నెలకొల్పితే, వాటిలో 6 ఎక్సలెన్స్ కేంద్రాలు నెలకొల్పిందని, నిధుల దుర్వినియోగం జరగలేదని, కేవలం రాష్ట్రప్రభుత్వం ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్సులు మాత్రమే కేసులోచూపిందని గతంలో హైకోర్టు చాలా స్పష్టం గా చెప్పింది. అలానే జీఎస్టీ చెల్లింపుల్ని బూచిగా చూపడం తప్పుడు విధానమేని సీఐడీ చీఫ్ సంజయ్ తెలుసుకోవాలి.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా అప్పటి ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ ఆమోదం తెలిపాక, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు ప్రాజెక్ట్ పనితీరు సక్రమంగా అమలయ్యేలా చూడటానికి రెండు కమిటీలు వేస్తూ మరో జీవో ఇచ్చారు. ఆయా కమిటీల్లో అందరూ అధికారులేగానీ, ఒక్కరూ కూడా రాజకీయనేతలు లేరు. ఏ అధికారి కూడా కేసుకు సంబంధించిన విచారణలో చంద్రబాబు పేరు చెప్పనప్పటికీ సంజయ్, అప్పటి ముఖ్యమంత్రి చెబితేనే నిధులు విడుదలచేసినట్టు అధికారులు చెప్పారంటున్నాడు.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో నిజంగా అక్రమాలుజరిగితే, ప్రాజెక్ట్ నిర్వహణకోసం నిధులు విడుదలచేసిన అప్పటి ఐ.ఏ.ఎస్ అధికారి ఎల్.ప్రేమచంద్రారెడ్డిని జగన్ ప్రభు త్వం ఎందుకు విచారించలేదు? ఎఫ్.ఐ.ఆర్ లో ప్రేమచంద్రారెడ్డి పేరు ఎందుకు లేదో సంజయ్ చెప్పాలి. ప్రాజెక్ట్ అంచనాల మదింపు, పరిశీలను సెంట్రల్ టూల్ డిజైన్ సంస్థకు అప్పగించింది కూడా ప్రేమచంద్రారెడ్డే. ప్రాజెక్ట్ అంచనాలు పెంచితే సంబంధిత అధికారికి సంబంధంలేకుండా చంద్రబాబుకే ఎలా సంబంధముంటుందో సంజయ్ చెప్పాలి.

ప్రాజెక్ట్ అమలుకోసం తొలుత ఒప్పందం చేసుకున్నప్పుడు కొంత మొత్తం సొమ్మిచ్చి, అనుకున్నట్టు అమలయ్యాక మిగిలిన సొమ్ముఇవ్వడం రివాజు. అదే విధానాన్ని టీడీపీ ప్రభుత్వం అమలుచేసింది. గంటాసుబ్బారావుకి టీడీపీ ప్రభు త్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందంటున్న వారు…సదరు అధికారి రాజశేఖర్ రెడ్డి హాయాంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్లో సుదీర్ఘకాలం పనిచేసిన విషయం మర్చిపోయారా? రాజశేఖర్ రెడ్డి హయాంలో పనిచేసినప్పుడు సమర్థుడిగా కనిపించిన అధికారి చంద్ర బాబు హాయాంలో తప్పుడు మనిషిగా ఈ ప్రభుత్వానికి కనిపించడం విడ్డూరం.

అలానే అపర్ణ అనే అధికారికి, సీమెన్స్ ప్రాజెక్ట్ కు ఎలాంటి సంబంధంలేదని, దీనిలో ఎలాంటి క్రాస్ ఇంట్రెస్ట్ లు లేవని గతంలోనే చెప్పడం జరిగింది. మనోజ్ పారేకర్, పెండ్యాల శ్రీని వాసరావుల పేర్లుకూడా కొత్తగా చెబుతున్నారు. నిన్నటి వరకు చంద్రబాబు ఐటీ నోటీ సుల్లో ఉన్నాయన్న వ్యక్తుల పేర్లు, ఇప్పటికిప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసు విచారణలోకి ఎలా వచ్చాయో జగన్ ప్రభుత్వమే చెప్పాలి.

ప్రాజెక్ట్ వ్యయం టీడీపీప్రభుత్వమే పెంచిందనడం కూడా అబద్ధమే. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఏఏ రాష్ట్రాల్లో ఎంత ఖర్చుతో అమలైందో, అదే వ్యయమే టీడీపీ ప్రభుత్వం వెచ్చించింది తప్ప, ఎక్కడా ఎక్కువ ఖర్చుపెట్టలేదు.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ తో పాటు ఫైబర్ గ్రిడ్, కాగితాలకే పరిమితమైన ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ లపై విచారణ చేయబోతున్నట్టు సంజయ్ చెప్పడం పాలకుల దుష్ట ఆలోచనలకు నిదర్శనం. సీఐడీ చీఫ్ మాటల్లో భవిష్యత్ లో ఎవరెవరిని ఏ ఏ కేసుల్లో నిందితులుగా ఇరికించబోతున్నారనేది సుస్పష్టమైంది. ముందే అనుకొని, తరవాత వారి పేర్లు కేసుల్లో పెట్టాలనకున్నప్పుడు విచారణ, దర్యాప్తు సక్రమంగా జరుగుతాయా ?

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక డిజైన్ టెక్ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో బ్రహ్మండమైన పనితీరు కనబరిచిందని ప్రశంసిస్తూ, వైసీపీప్రభుత్వంలోని అధికారి అర్జా శ్రీకాంత్ కితాబుతో కూడిన నివేదిక ఇచ్చారు. ఈ ప్రభుత్వంలోనే ఒక అధికారి ప్రశంసిస్తే, మరో అధికారి ఏదీ సక్రమంగా జరగలేదని చెప్పడం విచిత్రం.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సదరు ప్రాజెక్ట్ ఎండీగా ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేయలేదు గానీ, జగన్ ప్రభుత్వంలో రాజకీయంగా లభ్ధి పొందిన అజయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. ఎండీ నుంచి ఫిర్యాదు రానప్పుడు ప్రాజెక్ట్ ఛైర్మన్ గా ఉన్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసినప్పుడే ఈ ప్రభుత్వ రాజకీయ కుట్ర అర్థమవు తోంది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో నిజంగా తప్పులు జరిగితే, దాని నిర్వహణ కోసం వేసిన కమిటీల్లోని అధికారుల్ని వదిలేసి, కేవలంచంద్రబాబు ఒక్కడి పేరు చెప్ప డాన్ని బట్టే జగన్ అతని ప్రభుత్వ రాజకీయ కుట్రకోణం కనిపిస్తోంది.

అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహారంలో కూడా ప్రభుత్వం అనేక నిరాధార ఆరోపణలు చేసింది. టీడీపీ వాస్తవాలు బయటపెట్టడంతో చివరకు తోకముడిచింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ … రూ.370కోట్ల పెద్ద స్కామ్ అనడం పచ్చి అబద్ధం. గతంలో ఆ ప్రాజెక్ట్ కోసం అన్ని ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్నే ఆనాడు టీడీపీప్రభుత్వం అనుస రించింది. జగన్ రెడ్డి చెబుతున్నట్టు ఆడుతున్న సీఐడీ చీఫ్ సంజయ్ వద్ద నిజంగా ఆధారాలుంటే, చంద్రబాబు..లోకేశ్ ల అకౌంట్ల వివరాలు.. వాటికి ఏ ఖాతాలనుంచి ఎంత డబ్బులు వచ్చాయనే సమాచారం ఎందుకు బయటపెట్టలేదు. జగన్ రెడ్డి చెప్పు చేతల్లో పనిచేస్తూ, ఆయన ఆడమన్నట్టు ఆడేవారికి ప్రతీది తప్పుగానే కనిపిస్తుంది.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన రూ.370 కోట్లను ప్రాజెక్ట్ అమలుకోసం ఒప్పందం చేసుకున్న సంస్థలు వాటి ఆదాయంగా చూపాయి. సంస్థఖాతాల్లో ఆదాయంగా చూపినవారు, ప్రాజెక్ట్ నిర్వహణ, ఒప్పందాలతో తమకు సంబంధంలేదని ఎలా చెబుతారు?

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూ.370 కోట్లు దుర్వినియోగమయ్యాయని ఎలా చెబుతారని గతంలోనే విచారణసంస్థల్ని, ప్రభుత్వా న్ని హైకోర్టు ప్రశ్నించింది. అప్పుడు కూడా అధికారులు న్యాయస్థానానికి ఏమీ చెప్ప లేకపోయారు. ఈ ప్రభుత్వంలో చట్టం..న్యాయం.. ధర్మం ఏమీ లేవు. ఎప్పుడు ఏదైనా జరగొచ్చని తేలిపోయింది. వైసీపీ ప్రభుత్వ..ముఖ్యమంత్రి దుర్మార్గపు ఆలోచనలకు తగినట్టే, ఇకనుంచి తమపార్టీ వ్యవహరిస్తుంది.” అని నరేంద్ర తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE