– మన వల్ల సాధ్యం కానివి చూస్తే.. ఈ కాలంలో బీపీ రానిది ఎవరికి?
అక్కడ రెండు రోజుల పాటు కలెక్టర్లు, ఎస్పీల సమావేశం జరుగుతున్నాయి. దానికి కలెక్టర్లు, ఎస్పీలతోపాటు హెచ్ఓడీలు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, మంత్రులూ హాజరయ్యారు. మధ్యలో భోజన విరామం. ఆ సమయంలో స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు వారి మధ్యలో కూర్చుని, పిచ్చాపాటీ మాట్లాడుతూ తన మితాహారం కానిచ్చేశారు.
ఇక అక్కడి నుంచి కథ చదవండి..
ఆయన ప్లేట్లో ఉన్నాయి. మిగిలిన వారి ప్లేట్లు ఖాళీ. వడ్డించలేదా అంటే వడ్డించారు. ఆయన వడ్డించిన ఆ రెండు కూడా తినకుండా మనం మళ్లీ వడ్డించుకుంటే బాగోదని, తమకు వడ్డించినవి తినేసి.. మధ్యాహ్నం లంచ్ లో మొహమాట పడ్డట్లున్నారు! అది తొలిచిత్రం కథ.
పొద్దున 10కి వచ్చారు కలెక్టర్లతో సమీక్షకు. రాత్రి 8 దాటింది. పొద్దున మళ్లీ. సాయంత్రం వరకు 700 స్లయిడ్లకు దగ్గరగా.. ప్రతి స్లైడు మీదా ఆయన హోమ్ వర్క్ చేసి వ్రాసుకొచ్చారు. ఒక్కటి కూడా మిస్ కాకుండా ఏకాగ్రతతో విన్న ఒక్క నిత్య విద్యార్థి, ఆయనే అయ్యుండొచ్చు. రెండో చిత్రం.
రాత్రి సజీవ చరిత్ర-1984 పుస్తకావిష్కరణకు హాజరైన జనం చిత్రం.
ఆయన పుస్తకావిష్కరణ సభలో నవ్వుతున్న నాలుగో ఫోటో చూసి బీపీ వచ్చింది. మన వల్ల సాధ్యం కానివి చూస్తే.. ఈ కాలంలో బీపీ రానిది ఎవరికి?