– అప్పుడు కేవలం కాంగ్రెస్ నాలుగు మాత్రమే గెలిచింది
– రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ లో ఎన్ని గెలిచాడు?
– ఇప్పుడు మేము ఎన్ని గెలిచాము?
– మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ మీడియా చిట్ చాట్
వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉంది. వాళ్ళు ఆశించినన్ని స్థానాలు రాలేదు. మా పార్టీ కార్యకర్తల గట్టి పోరాటం వలన, అద్భుతంగా పోరాటం చేశారు. ఓవరాల్గా 30 మున్సిపాలిటీల పైగా వస్తాయి అనుకున్నాము.కానీ వచ్చిన 17 మున్సిపాలిటీలతో పాటు హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కూడా మాకు విజయావకాశాలు ఉన్నాయి.
బీజేపీ ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పుకుంటుందో అర్థం కావడం లేదు. వారికి గతంలో కంటే తక్కువ ఓట్లు, వార్డులు వచ్చాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని తెచ్చి ప్రచారం చేసింది, హడావిడి చేసింది. కానీ ఫలితాలు మాత్రం ఏ విధంగా వచ్చాయో అందరూ చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలవలేకపోయింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు తిరిగితే పెద్ద ప్రయోజనం ఏముండదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ అంశాలు మరియు ప్రభుత్వ అధికారంలో ఉన్నవాళ్లకి సాధారణంగా అనుకూలంగా ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బు ప్రభావం పెరిగిపోయింది. కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసింది. ఫలితాలు గొప్పగా రాని జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు అద్భుతమైన పోరాటం చేశాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ సంతృప్తికరమైన పోరాటం చేసింది. పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా గట్టిగా కొట్లాడారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళందరికీ ఈ ఎన్నికలే సమాధానం. ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించిన నిబంధనల విషయంలో ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదు. నిన్నటి దాకా కలెక్టర్లు ఒక మాట, చీఫ్ సెక్రటరీ ఒక మాట చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల పైన ఎవరికీ స్పష్టత లేదు.
మరోసారి ఫార్ములా ఈ అనే అంశాన్ని ప్రభుత్వం తెర మీదికి తీసుకొస్తున్నది. ఇప్పటికే నాలుగు సార్లు పిలిచి వాళ్లు చేసింది ఏమీ లేదు. కేవలం మరోసారి తమాషా కోసమే పిలవబోతున్నారన్న సమాచారం ఉంది. ఎన్ని సార్లు పిలిచినా పోతాము, ఉన్న సత్యం స్పష్టంగా చెబుతాము. ఎన్ని సార్లు పిలిచినా, ఎన్ని సార్లు విచారణ చేసినా మాకేమీ ఇబ్బంది లేదు. చివరికి జైలులో పెట్టినా భయపడేది లేదు. ఆ కేసులో ఎలాంటి పస లేదనే విషయాన్ని పోలీస్ అధికారులు, ఏసీబీ అధికారులు ముఖ్యమంత్రికి ఇప్పటికే పలుమార్లు చెప్పారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? అప్పుడు కేవలం కాంగ్రెస్ నాలుగు మాత్రమే గెలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని గెలిచింది? రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీ గా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ
లో ఎన్ని గెలిచాడు? ఇప్పుడు మేము ఎన్ని గెలిచాము? ప్రజలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు.