యూట్యూబ్ వ్యూస్ కి ఏ విధమైన డొబ్బు చెల్లించదు. అయితే ఎలా చెల్లిస్తుందో తెలుసుకోవాలంటే మొత్తం చదవండి
మొదటగా మీ ఛానల్ యూట్యబ్ పార్టనర్ ప్రోగ్రాం కి అర్హత సాధించాలి దాని కోసం
1.మీ యూట్యూబ్ ఛానల్ కి వెయ్యి(1000) మంది సబ్స్క్రయిబ్ర్సర్స్ మరియు నాలుగు వేల (4000) గంటల వాచ్ టైం మీ ఛానల్ లోని పబ్లిక్ వీడియోస్ కి ఉండాలి. అది కూడా గత 12 నెలల్లోపు ఉండాలి.
2.యూట్యూబ్ పోలసీస్ ని అన్ని కూడా కచ్చితంగా అనుసరించాలి. అప్పుడు యూట్యూబ్ మీ ఛానల్ నీ రివ్యూ చేసి యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రాం కి అర్హత ఉందా లేదా అని మీకు ఈమెయిల్ చేస్తుంది.
3.పై రెండు షరతులకి అర్హత పొందితే మీ వీడియోస్ పైన యాడ్స్ ప్లే అవుతాయి. ఈ యాడ్స్ కి వచ్చే రెవిన్యూ CPM మీద ఆధారపడి ఉంటుంది. CPM(Cost Per Mille) అంటే ఏదైనా ఒక వీడియో పైన ఒక వెయ్యి యాడ్స్ ప్లే అయితే అప్పుడు వచ్చే సరాసరి మొత్తం. అయితే ఇలా వచ్చిన రెవిన్యూ లో 45 శాతం యూట్యూబ్ తీసుకుని మిగిలిన మొత్తాన్ని కంటెంట్ క్రియేటర్స్ కి ఇస్తుంది. ఇది దేశాన్నీ బట్టి మారుతుంది.
4.ఇలా సంపాదించిన మొత్తాన్ని పొందాలంటే మీరు యూట్యూబ్ అకౌంట్ కి మీ యాడసెన్స్ అకౌంట్ నీ జతపరుచుకోవలి. మీకు 10$ వచ్చిన తరువాత మీ అకౌంట్ ఫిజికల్ వెరిఫికేషన్ కోసం యూట్యూబ్ యాడస్సై అకౌంట్ వెరిఫికేషన్ 6 సంఖ్యల పిన్ ను మీరు మీ యాడ్సెన్స్ లో ఇచ్చిన అడ్రస్ కి పంపిస్తుంది.ఈ వెరిఫికేషన్ అయిన తరువాత మీ బ్యాంక్ అకౌంట్ ను జతచేసుకునే ఆప్షన్ ఉంటుంది.
5.మీరు మీ ఛానల్ నుండి 100$ కనుక సంపాదిస్తే అది మీకు ఆ తరువాత నెలలో మీ ఛానల్ అకౌంట్ లో చూపిస్తుంది అదే రెవిన్యూ మీకు బ్యాంక్ అకౌంట్ లోకి వైర్ ట్రాన్స్ఫర్ ద్వారా పడుతుంది.
– సురేష్ కీర్తి