-పూడిక తీత చేపట్టా లంటున్న రైతులు
-గుర్రపు డెక్కతో పూడుకుపోయిన 11 నెంబరు సాగునీటి కాలువ
మోపిదేవి మండలంలోని గ్రామాలకు ప్రధానమైన సాగునీటి కాలువగా ఉన్న 11 నెంబరు కాలువ గుర్రపు డెక్కతో పూడుకుపోయి అద్వాన్నంగా తయారయింది.,. కాల్వలో నీరు పారుదలకు అవకాశం లేకుండా గుర్రపు డెక్క అల్లుకుపోయి మట్టితో పూడుకుపోయింది.
మండలంలోని కొక్కిలి గడ్డ శివారు బండి కొల్లంక వద్ద ప్రారంభమయ్యే పదకొండు నంబరు కాలువ మోపిదేవి, రావి వారి పాలెం, వెంకటాపురం, టేకుపల్లి, పెదకలేపల్లి ,అయోధ్య వరకు సాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది .ఈ కాలువ కింద దాదాపు 7వేల ఎకరాలు ఆయ కట్టు పైగా ఉండగా ఒక పెదకళ్ళపల్లి గ్రామంలోనే 4600 ఎకరాలు కాలువ కింద సాగు అవుతాయి.
కాలువకు చివరి భూములుగా ఉన్న పెదకల్లపల్లి రెవెన్యూ పరిధిలోని 4600 ఎకరాలు ప్రతి సంవత్సరం అంతంతమాత్రంగానే సాగునీరు అందుతుంది. ప్రస్తుతం కాలువ గుర్రపు డెక్కతో నిండి పూడుకు పోవడంతో ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఎండలు మెండుగా కాస్తూ ఉండటంతో ఈ సమయంలోనే కాలువకు పూడిక తీత పనులు చేపట్టాలంటూ ఆయకట్టు రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు .వర్షాకాలం ప్రారంభం కాకముందే కాలువలకు సాగునీరు విడుదల చేయడానికి ముందుగానే పూడిక తీత పనులు చేపట్టాలంటూ ఆయకట్టు రైతులు అధికారులను కోరుతున్నారు. కాలువకు పూడికితేత పనులు, మరమ్మతులు చేపట్టని పక్షంలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్ధకంగా మారడంతో పాటు 4600 ఎకరాలు బిడుగా వదిలేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు.
ఇప్పటికి గత కొద్ది సంవత్సరాలుగా ఏ విధమైన మరమ్మతులు చేపట్టకపోవడంతో కాలువ పూడిపోయిందని రైతులు ఆయిల్ ఇంజన్ ద్వారానే వచ్చిన నీటిని తోడుకుంటూ వ్యవసాయం చేశామంటున్నారు ఈ ఏడాది పూడిక తీయని పక్షంలో వ్యవసాయం వదిలి వేయడమే శరణ్యమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
మోపిదేవి మండలంలోని ప్రధానమైన సాగునీటి కాలువైన 11 నెంబర్ కాలువకు వెంటనే మరమ్మతులు చేపట్టేలా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలంటూ రైతులు అరజా సాంబశివరావు,అరజా వేణుగోపాల్ , అరజా రామాంజనేయులు అరాజా నరసింహారావు రావి రత్నగిరి ,రమణ, అరజా రాంప్రసాద్, వెంకటేశ్వరరావు తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.