హుద్ హుద్ పెనుతుఫాను Vs చంద్రబాబు
చంద్రబాబు ఇంట్లో బ్రాహ్మణీ శ్రీమంతం వేడుక
సాయంత్రం 3 గంటలకు చంద్రబాబు ఉన్న ఫళంగా అందుబాటులో ఉన్న వారందరితో వీడియో కాన్ఫరెన్స్ మొదలుపెట్టారు.
మంత్రులను వైజాగ్ బయలుదేరతీశారు .. వాళ్లంతా కట్టుబట్టలతో బయలుదేరారు. హైదరాబాద్ లో బయలుదేరిన కార్లు వైజాగ్ దసపల్లా ముందు ఆగాయి. విజయవాడలో డీజిల్ కొట్టించి భోజనం ప్యాకెట్లు తీసుకున్నారు.
తుఫాను తీరం దాటేది వైజాగ్ దగ్గరా లేక ఒరిస్సా దగ్గరా అనేది నిర్ధారణ కాలేదు. 2 రోజుల ముందే విపరీతమైన గాలివాన. గాలి వేగం దెబ్బకు బాబు గారి టీం, ఉండాల్శిన దసపల్లా హోటల్లో వర్షం నీరు చేరింది. అప్పటికే కరంటు స్తంభాలు మెలికలు తిరిగాయి..చెట్లు అన్నీ నేలకొరిగాయి. తీరం దాటటానికి ముందే కరంటు పోయింది.
మహేంద్ర షోరూం 4 వ అంతస్తులో ఉన్న కార్లు గాలికి ఎగిరిపోయాయి. తుఫాను సరిగ్గా కైలాసగిరి కొండ మీదగా తీరం దాటింది. తీవ్రత దెబ్బకు కైలాసగిరి మీద చెట్లు కూడా మాడిపోయాయి…ఆనవాళ్లు కోల్పోయాయి. వైజాగ్ చిగురుటాకులా వనికిపోయింది. ప్రజలు ప్రాణాలు అరచేతిలోనే.
చంద్రబాబు ప్రయాణించిన హెలికాప్టర్ కు ఆనాటి డిజిపి రాముడు, మొదట విజయవాడ వరకు.. ఆ తదుపరి రాజమండ్రి వరకే అనుమతి ఇచ్చారు. ఇక వైజాగ్ కు ససేమీరా అన్నారు. ఉప్పెన గాలి కొంచం కుదుటపడిన తరువాత రోడ్డు మార్గంలో తరువాత రోజు సాయంత్రానికి వైజాగ్ కలక్టరేట్ కి చేరుకున్నారు చంద్రబాబు. దసపల్లా లో చంద్రబాబు ఉండాల్శిన రూం అద్దాలు పగిలిపోయాయి. చంద్రబాబు తనతో రప్పించిన బస్సులోనే ఉన్నారు
ముందు చూపుతో తుని, అనకాపల్లి వరకు తెప్పించిన కరంటు స్తంబాలు, ట్రాన్స్ఫార్మార్లు అక్కరకు వచ్చాయి. మొదటి మూడు రోజులు చాలావరకు కొవ్వొత్తుల వెలుగులోనే సాగింది. చంద్రబాబు మొట్టమొదటి ఫోకస్ బ్లాక్ మార్కేట్ నిర్మూలన మీద పెట్టాడు.పాలు, కూరగాయలు ఏది రేటు ఎక్కువకు అమ్మటానికి వీలులేదు..
పెట్రోల్ కంపెనీ ప్రతినిధులతో మీటింగ్. No Question Of Petrol Block Market.. సెల్ ఫోన్ కంపెనీలతో మీటింగ్… కరంట్ లేదు కాబట్టి మేమేమి చెయ్యలేం అన్నారు. చంద్రబాబు వెంటనే రిలయన్స్ అనీల్ అంబానీ , ఎయిర్టెల్ మిట్టల్ తో మాట్లాడారు.
ప్రభుత్వం దగ్గర ఉండి జనరేటర్లు ఏర్పాటు చేయించింది. రాష్ట్ర నలుమూలల నుండి టెక్నీషియన్స్ వైజాగ్ ల్ దిగారు.. ఇష్టపడి కష్టపడ్డారు.. చంద్రబాబు సొంత మనిషిలా దగ్గర నిలబడి పని చేయించారు. .
కిలోమీటర్ల పొడవున రోడ్లకు అడ్డంగా పడిపోయిన చెట్లు తొలగించడం మరో ముఖ్యమైన ఇబ్బంది.. దాని గురించి ఆనాటి ఐపిఎస్ లు నిమ్మగడ్డ సురేంద్రబాబు, సాంబశివరావు, గౌతం సవాంగ్ , డిజిపి రాముడుతో చంద్రబాబు పెద్ద యుద్దమే చేశా రు.
సెక్రటేరియట్ గా వాడుకున్న కలక్టరేట్ లో కూడా పూర్తిగా చెట్ల వ్యర్ధాలతో నిండిపోయింది. 9 వ రోజు వైజాగ్ కరెంట్ వెలుగులు చూసింది. పూర్తిగా కరంటు రావడానికి 21 రోజులు పట్టింది.
5 వ రోజు ప్రధాని మోడీ జి పర్యటన… కలక్టరేట్ లోనే సమీక్ష చేశారు. వైజాగ్ నడిబొడ్డులో ఉండే ఒకనాటి సెంట్రల్ జైల్ ప్రాంతం రోడ్డు ఆనవాల్లు కూడా లేకుండా పోయింది. 21 రోజుల తరువాత వైజాగ్ కుదుటపడింది.
మరో ముఖ్య ఘట్టం… మొక్కలు నాటడం… 200 లీటర్ల ఆయిల్ టిన్లు కోసి ట్రీ గార్డు గా వాడారు. ఆనాడు ఐఏఎస్ లు యువరాజ్, శారద, ట్రైనీ ఐఏఎస్ గందం చంద్రుడు…. అక్కడ కష్టపడ్డ సహచర మంత్రులు, ఈ ప్రకృతి బీభత్సానికి సాక్షాలు..
చంద్రబాబు వైజాగ్ లో కాలు పెట్టిన వార్త తెలియగానే.. భయం లేకుండా హాయిగా ఊపిరి పీల్చుకున్నామని ప్రజలు చెప్పడం చంద్రబాబు విశ్వసనీయతకు పట్టాభిషేకమే.