ఏపీలో విపక్షం తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న మినీ మహానాడుల్లో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో మినీ మహానాడు బుధవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సభకు భారీ సంఖ్యలో టీడీపీ
(2/2) pic.twitter.com/IrBljrPvyg
— Telugu Desam Party (@JaiTDP) July 6, 2022
శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మదనపల్లె మినీ మహానాడుకు భారీ జన సందోహం హాజరైందని… ఈ స్థాయిలో టీడీపీ సభలకు హాజరైన జనాన్ని 1983 నుంచి తాను చూడనే లేదని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు.
ఇదిలా ఉంటే… ఈ సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు చేరుకున్న చంద్రబాబు… అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా మదనపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ-కర్ణాటక సరిహద్దు వద్ద చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కాసేపట్లో మహానాడు ప్రారంభమవుతుందనగా… అక్కడ భారీ వర్షం కురిసింది. వర్షంలోనే సభకు హాజరైన జనం నిలబడగా…వర్షంలో తడుస్తూనే చంద్రబాబు వేదిక మీదకు చేరుకున్నారు.
ఎన్టీఆర్ స్ఫూర్తి… చంద్రన్న భరోసా నినాదంతో మదనపల్లెలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న జిల్లా మహానాడుకు “చలో మదనపల్లె” అంటూ వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. (1/2)#MadanapalleMahanadu pic.twitter.com/2Fbd4FwIaA
— Telugu Desam Party (@JaiTDP) July 6, 2022