Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రం నుంచి భారీగా పెరిగిన ఎగుమతులు

ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, చేపట్టిన సంస్కరణల ఫలితంగా 2021-22 సంవత్సరంలో రాష్ట్రం నుండి ఎగుమతులు భారీగా పెరిగాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆదివారం పలు విషయాలును ప్రజలకు వివరించారు. 2020-21 లో రూ.1.24 లక్షల కోట్లుగా నమోదైన రాష్ట్ర ఎగుమతులు, 2021-22 లో 15.31% వృద్ధితో రూ.1.43 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు. ఎగుమతులు పెరగడం ద్వారా మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రజల సంపాదన పెరుగుతుందని అన్నారు.

దేశానికి రోల్ మోడల్ గా ఏపీ
పిల్లలకు ఇవ్వగలిగే నిజమైన ఆస్తి చదువు మాత్రమే అని నమ్మినవారిలో సీఎం జగన్ దేశంలోనే ముందుంటారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి విప్లవాత్మక విధానాలను ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విద్యా విధానాలు, సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, విద్యాభివృద్ధి కార్యక్రమాల అమలులో ఏపీ దేశానికే రోల్ మోడల్ అని అన్నారు. ఏపీ విద్యావిధానాలను అనేక ఇతర రాష్ట్రాలు ప్రశంసించడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయని అన్నారు.

LEAVE A RESPONSE