-ప్రభుత్వం ఒక్కో ఫోన్‌కు చెల్లిస్తున్న ధర: ₹14,213
– శ్యాంసంగ్అధికారిక వెబ్సైట్ ప్రకారం అదే ఫోన్ మార్కెట్ ధర: ₹11,999
– సుమారు ₹8,44,19,820 మేర ధర వ్యత్యాసం
– 38,130 ఫోన్ల అసలు మార్కెట్ విలువ: ₹45,75,21,870
– ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం: ₹54,19,41,690
– ధర నిర్ణయం ఎలా జరిగింది?
– ధర వ్యత్యాసం ఎవరికి లాభించింది?
– బిఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ మన్నె
హైదరాబాద్: పోషణ్ అభియాన్ మొబైల్ టెండర్లో అవినీతిపై విచారణ చేయాలి. తెలంగాణ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం కింద అంగన్వాడీ కార్యకర్తలకు 38,130 మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడానికి టెండర్ పిలవడం జరిగింది.ఈ టెండర్లో అర్హత పొందిన కంపెనీలకు శ్యాంసంగ్ గెలాక్సీ A06 (4GB/64GB) స్మార్ట్ ఫోన్ల సరఫరా కోసం ₹54,19,41,690 విలువైన కాంట్రాక్ట్ ఇవ్వబడింది.
ఈ కాంట్రాక్ట్ ప్రకారం: ప్రభుత్వం ఒక్కో ఫోన్‌కు చెల్లిస్తున్న ధర: ₹14,213 శ్యాంసంగ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం అదే ఫోన్ మార్కెట్ ధర: ₹11,999
దీని ప్రకారం: 38,130 ఫోన్ల అసలు మార్కెట్ విలువ: ₹45,75,21,870. ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం: ₹54,19,41,690
అంటే సుమారు ₹8,44,19,820 మేర ధర వ్యత్యాసం కనిపిస్తోంది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, సాధారణంగా బల్క్ ఆర్డర్లలో ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ మార్కెట్ ధర కంటే అధికంగా చెల్లించబడినట్లు కనిపించడం అనుమానాలకు తావిస్తోంది.
పోషణ్ అభియాన్ నిధులు అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమం కోసం వినియోగించాల్సిన ప్రజా ధనం.
అందువల్ల ఈ కొనుగోలు ప్రక్రియలో: ధర నిర్ణయం ఎలా జరిగింది? ధర వ్యత్యాసం ఎవరికి లాభించింది? అనే అంశాలపై నిష్పక్షపాతంగా పూర్తి స్థాయి విచారణ జరగాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము.
జతపరచిన పత్రాలు:
1. టెండర్ / ఒప్పంద పత్రం
2. టెండర్‌కు అర్హత పొందిన కంపెనీల వివరాలు
3. శ్యాంసంగ్ అధికారిక వెబ్సైట్ ఆధారంగా పరికరం ధర వివరాలు
