Suryaa.co.in

Telangana

ఈ సినిమాలో మానవ సంబంధాలను గొప్పగా చూపారు

– మొట్టమొదటి జీరో బడ్జెట్ సినిమా శరపంజరం సినిమా ప్రివ్యూ షో ను రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ తో కలిసి చూసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..
శర పంజరం సినిమా మొట్ట మొదటి జీరో బడ్జెట్ సినిమా.మా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం అమ్మాపురంకు చెందిన నవీన్ కుమార్ గట్టు దర్శకత్వం వహించడం, కెమెరామన్, హీరోయిన్ వంటి వాళ్ళంతా ఇక్కడి వారే కావడం నాకు గర్వకారణం. గంగిరెద్దులను ఆడించే అబ్బాయి – జోగినీ అయిన అమ్మాయిల మధ్య ప్రేమ, సంస్కృతిని, అతి సామాన్య జీవితాలను కథగా తీసుకున్నారు. నాటి నిజాం కాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టారు.ఈ సినిమాలో మానవ సంబంధాలను గొప్పగా చూపారు. సినిమా మొత్తాన్ని అమ్మాపురం పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు.ఇప్పటికే ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, ఆస్కార్ విజేత చంద్రబోస్, వేణు ఉడుగుల, ఆర్పీ పట్నాయక్ లు ఒక పాటను విడుదల చేశారు.

ఇందులో హీరోగా నటించిన నవీన్ కుమార్ గట్టు, జబర్దస్త్ వెంకీ, రాజమౌళి, బాషా వంటి వాళ్ళంతా నాకు బాగా తెలిసిన వారు.వీళ్ళంతా వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. ఇందులో తొర్రూరుకు సంబంధించిన వారే ఎక్కువగా నటించారు.వీళ్ళు మంచి సక్సెస్ సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. బలగం సినిమా తర్వాత మరో మంచి సినిమా శర పంజరం అవుతుంది.ఇంత మంచి సినిమా తీసిన శర పంజరం యూనిట్ మొత్తాన్ని అభినందిస్తున్నాను.ఆల్ ది బెస్ట్. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ మొత్తం పాల్గొంది.

LEAVE A RESPONSE