– పక్షవాతం వచ్చినా క్యూలో నిల్చోవాల్సిందే
సర్కారు దవాఖానాలో ఇదో అమానవీయ పరిస్థితి. ఎర్రగడ్డలోని ఆయుర్వేద ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ల కి ప్రభుత్వం అందించే మధ్యాహ్నం భోజనం చేయాలంటే కాళ్లు చేతులు సహకరించకపోయినా, బెడ్ పై నుండి లేచి లైన్లో నిల్చొని.. నరకయాతన పడాల్సిందే. నడిచేందుకు కాళ్లు సహకరించకపోయినా, అలాగే కాళ్లు ఈడ్చుకుంటూ వరసలో నిలబడి భోజనం తెచ్చుకోవాల్సిందే. పక్షవాతం ఉన్న రోగుల బెడ్ వద్దకు భోజనం ఇచ్చే దిక్కులేదు. . ఇక్కడ ఉన్న వాళ్ళలో పక్షవాతంతో కాళ్లు చేతులు సరిగా పని చేయ ని రోగులే అధికశాతం ఉండటం గమనార్హం. అయినా పర్వాలేదు.. లైన్ లో నిల్చుని భోజనం తీసుకోవాల్సిందే. ఇలా లైన్ లో నిల్చొని నడవడానికి రోగులు ఇబ్బంది పడాల్సిందే. ఇదీ ఆయుర్వేద ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ‘ఆకలి’పోరాటం.