– ఏఐ టెక్నాలజీకి హైదరాబాద్ గ్లోబల్ సెంటర్
-డిజైన్ సామాజిక మార్పునకు ఆయుధం కావాలి
– Ux ఇండియా 25 అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
– త్వరలో సెంటర్ ఆఫ్ exlence ఇన్ డిజైన్: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: యాప్ డిజైన్ లీడర్ గా హైదరాబాద్ ను నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. UMO ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం హైటెక్ సిటీ లోని ట్రైడెంట్ హోటల్లో “u x ఇండియా 25″ పేరిట ఏర్పాటు చేసిన 21వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూజర్ ఎక్స్పీరియన్స్ & ప్రోడక్ట్ డిజైన్” ను ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లాంఛనంగా ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం ప్రసంగించారు.
హైదరాబాద్ నగరం ఎటువంటి టెక్నాలజీ నైనా అందిపుచ్చుకొని లీడర్ గా ఎదుగుతుంది అన్నారు. Ai టెక్నాలజీకి హైదరాబాద్ మహా నగరాన్ని గ్లోబల్ సెంటర్ గా నిలబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ పట్టుదలతో ఉందన్నారు.
ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన ప్రతినిధులు హైదరాబాద్ వాతావరణం, సంస్కృతి, కళలు, ఆహారం అన్నిటిని ఆస్వాదించాలని, ప్రతినిధులు ఈ రాష్ట్రంలో ప్రధానంగా టెక్నాలజీ రంగంలో గుర్తించిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రతినిధులను కోరారు. డిజైన్ అనేది కేవలం అందానికి కాదు అది సామాజిక మార్పునకు ఆయుధం కావాలి అని ఉద్బోధ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం సమానత్వం, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. హైదరాబాదును ప్రపంచ డిజైన్ క్యాపిటల్ గా మార్చడానికి కలిసి పని చేద్దామని ప్రతినిధులకు డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ఈ అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్ చరిత్రలో ఒక మలుపు రాయి అన్నారు. తెలంగాణ రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తును పరిపుష్టం చేయడంలో, మరో అడుగు ముందుకు వేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు మన జీవితాల్లో అనివార్యమైనవి, కానీ ఒక యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటేనే అది విజయవంతం అవుతుంది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ ఇంక్లూజన్ను ప్రోత్సహిస్తుంది, TS- IPASS వంటి పాలసీల ద్వారా స్టార్టప్ లకు చేయూతనిస్తుంది అని తెలిపారు. భారతదేశంలో యూపీఐ వంటి యాప్ లు సరళంగా రూపొందించడంతో పెద్ద విజయం సాధించాయి అన్నారు. ప్రాంతీయ భాషల్లోనూ యాప్ లు రూపొందించడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అన్నారు.
త్వరలో “సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ డిజైన్”
– రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ ను గ్లోబల్ డిజైన్ హబ్ గా మార్చాలనే సంకల్పంతో త్వరలోనే “సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ డిజైన్”ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు.
టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్ లాంటి సంస్థల ద్వారా తెలంగాణ ను ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న “ఏఐ ఇన్నోవేషన్ హబ్ “లో డిజైనింగ్ కు పెద్దపీట వేస్తున్నామన్నారు. డిజైనింగ్ అంటేనే సృజనాత్మకత అని, కాకపోతే… ఆది యూజర్ ఫ్రెండ్లీ గా ఉండాలన్నారు.
అప్పుడే ఆ యాప్ లేదా వెబ్ సైట్ మనుగడ సాధ్యమన్నారు. ఈ ప్రక్రియలో ఏఐ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ వల్ల ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా చూడాలని సూచించారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే అంకుర సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నామన్నారు.