– డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ మఖ్తల ఆహ్వానం మేరకు హైదరాబాద్ కు రాఖ
– టీహబ్, టీ వర్క్స్ సందర్శనలో ప్రశంసించిన ఒమన్ రాజ వంశస్తుడు
– పాల్గొన్న ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర నీటివనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్
– టీహబ్ సహా టీ వర్క్స్ లోని ప్రొటొటైప్ కేంద్రాల వీక్షణ
హైదరాబాద్, ఆగస్టు 12,2023: స్టార్టప్, ఇన్నోవేషన్ రంగాలలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆవిష్కరణలు ముందంజలో ఉండటం తెలంగాణకు గర్వకారణమని రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC- ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి) చైర్మన్ సందీప్ మఖ్తల ఆహ్వానం మేరకు ఒమన్ రాజ వంశస్తుడు ఫిరాస్ బిన్ ఫాతిక్, రాష్ట్ర నీటివనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ తో కలిసి నేడు టీవర్క్స్, టీ హబ్‌లలోని ఆవిష్కరణలను వీక్షించారు. టీ వర్క్స్, టీహబ్‌లోని వివిధ రకాల స్టార్టప్‌లను సందర్శించిన బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు హైదరాద్ ఖ్యాతిని చాటిచెపుతున్నాయని కొనియాడారు. ఒమన్ రాజవంశీయుడు ఫిరాస్ బిన్ ఫాతిక్ ఈ సందర్భంగా రాష్ట్ర ఇన్నోవేషన్లను ప్రశంసించారు.
ప్రపంచంలోని తెలుగు ఐటీ సంస్థలకు వేదికగా నిలిచి రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకుపోవడం లక్ష్యంగా ఏర్పాటైన వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC- ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి) నగరంలోని ఆవిష్కరణల ప్రత్యేకతలను చాటిచెప్పడంలో భాగంగా, ఒమన్ రాజవంశీయుడు ఫిరాస్ బిన్ ఫాతిక్ ను హైదరాబాద్ సందర్శించాల్సని ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల కోరారు.
ఈ ఆహ్వానం మేరకు నేడు నగరానికి విచ్చేసిన ఒమన్ రాజవంశీయుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర నీటివనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ మఖ్తలతో కలిసి టీ వర్క్స్, టీహబ్‌లోని వివిధ రకాల స్టార్టప్‌లను సందర్శించారు. ప్రొటొటైప్స్ కేంద్రాలను వీక్షించారు. ఇరానీ చాయ్‌కు సంబంధించి ఏర్పాటైన `చాయ్ మినార్`ను వీక్షించారు. వ్యవసాయ ఉత్పత్తులకు చెందిన మరో స్టార్టప్ వీక్షించారు. ఈ సందర్భంగా స్టార్టప్‌లకు చెందిన ప్రతినిధులతో అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఐటీ పరిశ్రమలో తన ముద్ర వేసుకున్న హైదరాబాద్‌ను స్టార్టప్, ఇన్నోవేషన్ రంగంలోనూ సత్తా చాటేలా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. టీ హబ్, టీ వర్క్స్ వంటివి ఇందుకు ఉదాహరణ అని తెలియజేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న యువత ఉద్యోగాలతో పాటుగా ఇన్నోవేషన్ల విషయంలోనూ ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు.
ఒమన్ రాజవంశీయుడు ఫరాజ్ మాట్లాడుతూ ఇన్నోవేషన్ రంగంలో హైదరాబాద్ తన ముద్ర వేసుకుందని తెలిపారు. కొత్తదనంతో ఉన్న ఈ ఆవిష్కరణలు విజయవంతమై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర నీటివనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర యువత నిత్య చైతన్య స్ఫూర్తితో ముందుకు సాగుతూ టెక్నాలజీలో తమ ముద్ర వేసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ మఖ్తల మాట్లాడుతూ, తమ ఆహ్వానాన్ని గౌరవించి ఒమన రాజవంశీయుడు ఫరాజ్ నగరానికి విచ్చేయడం సంతోషకరమన్నారు. తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ తో కలిసి టీ వర్క్స్, టీహబ్‌లోని వివిధ స్టార్టప్‌లను సందర్శించడం ద్వారా మన ఆవిష్కరణల ప్రత్యేకత ఒమన్ దేశానికి మరోమారు సుపరిచితం అయిందని పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిష్కరణల పట్ల ఒమన్ రాజవంశీయుడి కితాబు ఇన్నోవేటర్లకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. తెలుగువారి ఆవిష్కరణల ప్రత్యేకతను చాటిచెప్పడంలో వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC- ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి) ముందుంటుందని స్పష్టం చేశారు.