Suryaa.co.in

Telangana

జిల్లాలకు హైడ్రా విస్తరించాలి

– హైడ్రా పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ అనిల్
– హైడ్రా కు తన ఎంపీ లాడ్స్ నుంచి 25 లక్షల రూపాయలు కేటాయిస్తూ లేఖను కమిషనర్ రంగనాథ్ కు అందజేసిన అనిల్ యాదవ్
– బుద్ధభవన్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసిన ఎంపీ అనిల్ యాదవ్

హైదరాబాద్: నగరంలోనీ చెరువులు కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారు. దానికి కమిషనర్ గా మంచి అధికారిగా పేరున్న రంగనాథ్ ను నియమించారు. హైడ్రా పని తీరు అభినందిస్తూ.. హైడ్రా కు ఎంపి లాడ్స్ నిధుల నుంచి 25 లక్షల రంగనాథ్ కు అందజేశాం.

పదేళ్లు అధికారంలో అన్న కేసిఆర్ హైదరాబాద్ మహానగరం గా తీర్చి దిద్దుతం అన్నారు. కానీ హైదరాబాద్ లోని అన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి. కనీసం ఒక్క చెరువును కూడా కాపాడలేక పోయారు.. సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్ తరాల గురించి అలోచించి.. హైదరాబాద్ అద్భుతమైన నగరంగా ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాజకీయాల కోసం హైడ్రా అని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇది హైదరాబాద్ అభివృద్ధి కోసం చేస్తున్నారు. అనేక నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. అటువంటి ఇబ్బందులు రావద్దు అని ఈ కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. పదేళ్ల కింద అనేక చెరువులు నిండు కుండల ఉండేది. అక్రమ కట్టడాలు చేపట్టిన వారు ఎవరు అయిన హైడ్రా వదిలిపెట్టదు.

డ్రగ్స్ నివారణ విషయంలో కూడా సీఎం ప్రత్యెక దృష్టి పెట్టారు. హైడ్రా ను ఇతర జిల్లాలలో కూడా అమలు చేయాలని వినతులు ప్రభుత్వానికి అందుతున్నాయి. జిల్లాలకు హైడ్రా విస్తరించాలి. హైడ్రా కు పూర్తి మద్దతు ఇస్తున్నాం.

LEAVE A RESPONSE