Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ అనాగరిక పాలన వల్ల ఐపీసీ సెక్షన్లు నేర్చుకుంటున్నా

– హౌస్ అరెస్టులు చేసే అధికారం పోలీసులకు లేదు
– చంద్రబాబు నాయుడు

175 నియోజకవర్గాలలో లీగల్ టీంలు పనిచేస్తున్నాయి. కుప్పం నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలని నేను భావించేవాడిని. కుప్పం ఒక ప్రశాంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ప్రయత్నంచాను. ఇక్కడ పోలీసు స్టేషన్, కోర్టులు, జైళ్ల అవసరం రాకూడదు అనుకునేవాడిని. అలాంటి నియోజకర్గంలో ఇప్పుడు ఈ వైసీపీ దుర్మార్గులను ఎదుర్కోవడానికి నేనే లాయర్లు ఎతుక్కునే పరిస్థితి వచ్చింది. కుప్పంలో 70 మందిని అరెస్టు చేసి 20 రోజులు జైళ్లలో పెట్టారు. మనం ఒక సైకోను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సైకోలను కట్టడిచేయాలంటే తెలుగుదేశం నాయకులు ప్రజల సమస్యలపై ప్రోయాక్టివ్ గా పనిచేయాలి.

పోలీసులు అప్రజాస్వామికంగా అర్ధరాత్రులు అరెస్టులు చేయడానికి వస్తే ఏ కేసుపై అరెస్టు చేస్తున్నారో , అడిగి రాతపూర్వక నోటీసులు అడగాలి. బ్యాడ్జ్ లేకుండా వస్తే బ్యాడ్జ్ పెట్టుకోమని అడగండి. ఇదే సమయంలో లోకల్ పార్టీ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తే ఖచ్చితంగా సీసీ కెమెరాల రికార్డింగు చేయమని అడగండి. నా స్టూడెంట్స్ డేస్ నుంచి ఐపీసీ సెక్షన్లు చదువుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ, జగన్ రెడ్డి చట్టవ్యతిరేక పాలన కారణంగా నేడు వాటిని తెలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

హౌస్ అరెస్టులు చేసే అధికారం పోలీసులకు లేదు:
హౌస్ అరెస్టులు చేసే అధికారం పోలీసులకు లేదు. హౌస్ అరెస్టులు చేయాలంటే ఇంటిని జైలుగా మార్చేందుకు పోలీసులు పర్మీషన్ తీసుకోవాలి. బాబ్లీ అంశంలో మహారాష్ట్రకు మేం వెళ్లినప్పుడు అక్కడి పోలీసులు మమల్ని అరెస్టు చేసి , మేమున్న హాస్టల్ ను జైలుగా మార్చి మమ్మల్ని అక్కడే ఉంచారు. అలా చేయకపోతే వారికి మమ్మల్ని హౌస్ అరెస్టు చేసే అధికారం లేదు. ఒకవేళ అరెస్టు చేస్తే అది చట్టవ్యతిరేకం అవుతుంది. ప్రతీ నియోజకవర్గంలో లీగల్ టీంలు లీగల్ స్క్రూటినీ చేసి కార్యకర్తలకు లీగల్ సహాయం అందించాలి. 27 దళిత పథకాలను రద్దు చేసిన జగన్ రెడ్డిని ప్రశ్నించినందుకు గుడివాడలో ఒక మహిళ మహిళపై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇది చాలా దుర్మార్గం.

చెంగల్రాయుడు:
పోలీసులు ఫోన్ చేస్తే తెలుగుదేశం కార్యకర్తలు వాయిస్ రికార్డులు చేయాలి. పోలీసులు మీ ఇళ్లకు వచ్చి స్టేషన్ కు రమ్మంటే రాతపూర్వక నోటీసును అడగాలి. 7 సంవత్సరాల లోపు శిక్షపడే నేరాలపై పోలీసులే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలి. రిమాండ్ రిపోర్టు కూడా రాయకుండదు. అలాకాదని చేస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అది కంటెప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది. ఇది చట్టం. మంగళగిరి కోర్టు, ఆ తీర్పుపై హైకోర్టు ఒపీనియన్ చారిత్రాత్మకమైని. ఇప్పటి పరిస్థితుల్లో ఇది చాలా అవసరం.

పర్చూరు అశోక్ బాబు
గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఏ పార్టీ కూడా పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ.. ప్రస్తుతం ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పాత జిల్లా ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాయలసీమలో గ్రాడ్యుయేట్, టీచర్, ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతున్నాయి. రాయలసీమ నుండి కంచర్ల శ్రీకాంత్, బి.రాంగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర నుండి చిన్ని లక్ష్మీకుమారి టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీపడుతున్నారు. నియోజకవర్గానికి సగటున 9వేల మంది వరకు రిజిస్టర్ అయ్యారు. క్రికెట్ మ్యాచ్ లో సెమీఫైనల్స్ గెలిచిన టీం ఫైనల్స్ గెలుచుకోవడం చూస్తుంటాం. అదే విధంగా.. ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే. జగన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నారు. ఈ మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు గెలిస్తే సాధారణ ఎన్నికల్లో గెలుపు మనదే.
గ్రాడ్యుయేట్లలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఉద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు. ఉద్యోగాల్లేవు. నిరుద్యోగ భృతి లాంటి పథకాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూడు సీట్లు గెలవడం అంత కష్టమేమీ కాదు. ప్రజల్లో జగన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను, ప్రజా సమస్యలను సీరియస్ గా తీసుకుంటే గెలుపు ఏమాత్రం కష్టం కాదనే విషయాన్ని అందరూ గుర్తించాలి.

శిష్ట్లా లోహిత్
దేశంలో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పటు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా సుమారు రూ.100 కోట్లకు పైగా నిధులు కార్యకర్తల కోసం ఖర్చు చేయడం జరిగింది. అదే సమయంలో కరోనా లాంటి విపత్తులు సృష్టించిన విలయం నుండి తప్పించుకోవడం కోసం, కార్యకర్తల ఆరోగ్యమే లక్ష్యంగా న్యూట్రిఫుల్ యాప్ రూపొందించి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తోంది. కుటుంబ పెద్దల్ని కోల్పోయిన వారికి అండగా ఉంటూ, వారి పిల్లల చదువులకు భరోసా ఇస్తూ తోడుతా నిలుస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే.

LEAVE A RESPONSE